గత రెండు సంవత్సరాలుగా విశాఖ వేదికగా జరుగుతున్న సిఐఐ సమ్మిట్ , ఈ సంవత్సరం కూడా మూడో సారి వరుసుగా జరుగుతుంది... అయితే, ఇది జరిగే ప్రతిసారి, వైఎస్ఆర్ పార్టీ, ఇది చెడగొట్టటానికి, చెడ్డ పేరు తేవటానికి, ఎదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది... జగన్ కూడా, ఎప్పుడూ ఈ సమ్మిట్ ని ఎగతాళి చేస్తూ ఉంటాడు... అయితే ఈ సంవత్సరం కూడా, ఒక భారీ కుట్ర పన్నారు... తన మనుషుల చేత ఫేక్ ఎంఓయులు కుదుర్చుకుని, తరువాత వాళ్ళు నిజమైన వ్యక్తులు కాదు, అర్హత లేకపోయినా, ఎంఓయులు కుదుర్చుకున్నారు అంటూ, ప్రచారం చెయ్యటానికి పన్నాగం పన్నారు...

cii summit 23022018 2

ఈ విషయం ప్రభుత్వానికి తెలియటంతో అలెర్ట్ అయ్యారు.. విశాఖపట్నంలో శనివారం నుంచి జరిగే పెట్టుబడిదారులు భాగస్వామ్య సదస్సుకు, ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసారు... పక్కాగా ప్రాజెక్టును నెలకొల్పుతారని విశ్వాసం కలిగిన పార్టీలతోనే సంప్రదింపులు జరిపి ఎంఓయూలకు రంగం సిద్దం చేస్తున్నారు... సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)తో ముందుకు వచ్చిన వారీ ప్రతిపాదనలనే స్వీకరించారు... వాటిని స్కానింగ్ చేసి, ఆ కంపెనీకి నిజంగానే ఆసక్తి, చిత్తశుద్ది ఉన్నాయని విశ్వాసం కుదిరితేనే వాటిని ఎంఓయూ వరకు తీసుకువెళుతున్నారు. వాటి వయబులిటి, నిధులు, భూమి, ఇతర సాంకేతిక అంశాలను సంబంధిత శాఖలన్నీ పరిశీలించిన తరువాతే పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు 400 ప్రాజెక్టులను సిద్దం చేశారు. వీటికి ఎంఓయూలు చేసుకుంటే రూ.4 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని అంచనా.

cii summit 23022018 3

ఈ సారి సదస్సులో ప్రాజెక్ట్ కనీస విలువ రూ.3 కోట్లుగా తీసుకున్నారు... గతంలో రూ.10 లక్షలు దాటిన వాటిని స్వీకరించి ఒప్పందాలు చేసుకున్నారు... ఇదే ఆయుధంగా, కుట్ర ప్లాన్ చేసారు... కొంత మందితో కంపెనీలు పెట్టిస్తున్నట్టు నమ్మించి, ఎంఓయులు కుదుడుర్చుకునేలా చేసి, తరువాత వీరు సామాన్యులు, ఇలాంటి వారితో ఎంఓయు చేసుకున్నారు అని ప్రచారం చేసి, రాష్ట్రం పరువు తీసి, పారిశ్రామిక రంగంలో రాష్ట్రానికి చెడ్డ పేరు తేవటానికి పన్నిన పన్నాగం, ప్రభుత్వం పట్టేసి, దానికి కౌంటర్ ప్లాన్ తో తిప్పి కొట్టింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read