మన తెలుగు సినీ ఇండస్ట్రీ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై చూపిస్తున్న ప్రేమ, కొన్నేళ్ళుగా చూస్తూనే ఉన్నాం... తెలంగాణా పై ప్రేమో, కెసిఆర్ అంటే భయమో కాని, మన ఆంధ్రప్రదేశ్ అంటే ఎప్పుడూ చిన్న చూపే... అయితే, ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన బాట పట్టటంతో, సినీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వస్తుంది అని అందరూ అనుకున్నారు.. అయితే, తమిళనాడు జల్లికట్టుకు మద్దతు ఇచ్చిన మన సినీ హీరోలు, మన ఆంధ్రప్రదేశ్ సమస్య పై మాత్రం స్పందించలేదు... ఈ క్రమంలో కొంత మంది రాజకీయ నాయకులు కూడా, తెలుగు సినీ ఇండస్ట్రీ పై విమర్శలు చేసారు... నంది అవార్డులు పై రచ్చ చేసిన వారు, మా సమస్యల పై కనీసం స్పందించరా అంటూ, విమర్శలు చేసారు..
ఈ పరిస్థుతుల్లో, కొంత మంది సినీ ప్రముఖులు ఈ రోజు అమరావతి వచ్చారు... జెమిని టివి ఎండి పి.కిరణ్ నేతృత్వంలో ముఖ్యమంత్రిని కలిసారు... కేంద్రం పై యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని టాలీవుడ్ పరిశ్రమ తెలిపింది... ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసిన టాలీవుడ్ ప్రముఖులు, విభజన హామీల అమలు కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి బాసటగా నిలుస్తామని తెలిపారు...
సీఎం చంద్రబాబును కలిసిన వారిలో కెఎల్ నారాయణ, జీకే , అశ్వనీదత్ , కేఎస్ రామారావు , కె. వెంకటేశ్వరారావు, కె. రాఘవేంద్రరావు , జెమిని కిరణ్ ఉన్నారు... అఖిల పక్షం పిలువు మేరకు ఏప్రిల్ 6 వరకు, నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని సినీ పరిశ్రమ చెప్పింది... సినిమా షూటింగ్ లకు కూడా నల్ల బ్యాడ్జీలతోనే హాజరవుతామని తెలిపారు... ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తోందనే విషయాన్ని సినీ ప్రముఖులకు చంద్రబాబు వివరించినట్టు సమాచారం... అయితే, తెలుగు సినీ పరిశ్రమ నిర్ణయంతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవాక్కయ్యారు... ఇప్పటికైనా, తెలుగు సినీ పరిశ్రమ, మనకు మద్దతు తెలపటం పై, సంతోషం వ్యక్తం చేస్తున్నారు... బలమైన కేంద్రంతో పోరాటం చేసే సమయంలో, తెలుగు సినీ పరిశ్రమ మద్దతు తెలపటం ఆహ్వానించదగ్గ పరిణామం అని, ఇలాగే సినీ పరిశ్రమ అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలబడాలని ప్రజలు కోరుకుంటున్నారు...