ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కడ ఉంటుందనే దానిపై చర్చోపచర్చలు జరిగాయి. ఏపీకి తరలిపోతుందని చాలా విశ్లేషణలు వచ్చాయి. అనేక మంది సినీ ప్రముఖులు విశాఖలో స్టూడియోలు కట్టేందుకు స్థలాలు కూడా కొనుగోలు చేశారన్న ప్రచారమూ జరిగింది. అయితే టాలీవుడ్ పెద్దలు ఎప్పుడూ చిత్ర పరిశ్రమ తరలిపోతుందనే ప్రకటనలు చేయలేదు. పైగా హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ పాతుకుపోయిందని, తరలిపోవడమనేది సాధ్యం కాదని స్పష్టం చేశారు కూడా. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను కూడా చిత్ర నిర్మాణాలకు కేంద్రంగా చేయాలని నిర్ణయించారు.

cine 21082018 2

ఇప్పటికే ఈ విషయంపై ఇండస్ట్రీ వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నట్లుగా కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. విశాఖ, అమరావతిల్లో ఏ ప్రాంతాన్ని పరిశ్రమలకు కేంద్రంగా చేయాలన్న దాని పై సినీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తనను కలిసిన సినీ పరిశ్రమ వర్గాలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. పలువురు విశాఖ అయితే సినీ పరిశ్రమకు బాగుంటుందని సలహా ఇచ్చారన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్‌లో నిలదొక్కుకునేలా ఒకప్పుడు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించామన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా పరిశ్రమ అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటామన్నారు. సహజ అందాలతో ఉండే విశాఖ, గోదావరి జిల్లాలు సినిమా షూటింగ్‌లకు కేంద్రంగా ఉంటున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు.

cine 21082018 3

అయితే, ఇవి మాటల వరుకే కాకుండా, చేతల్లో కూడా చూపించాలని చంద్రబాబు రంగంలోకి దిగారు. ముందుగా చిన్న సినిమాలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం వరాలు కురిపించింది. చిన్న సినిమాలకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఇవ్వనుంది. రూ.4కోట్ల లోపు సినిమా తీస్తే చిన్న సినిమాగా పరిగణిస్తామని ఫిల్మ్, టెలివిజన్ & థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ తెలిపారు. సినిమాపై వచ్చే పన్ను మొత్తం వెనక్కి ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. జీఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వ 9 శాతం పన్ను రద్దు చేస్తామని చెప్పారు. పన్ను రాయితీలు, లోకేషన్లు ఉచితంగా ఇస్తామని అంబికా కృష్ణ పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read