తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌పై ఏపీ ప్ర‌జ‌లు చాలా కోపంగా ఉన్నారని నిర్మాత యలమంచిలి రవిచంద్ తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు పోరాటం చేస్తుంటే సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని అన్నారు. అదే తెలంగాణ రాష్ట్రం అడిగినా… అడగకపోయినా సినీ పరిశ్రమ వెంటనే స్పందిస్తుందని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు టికెట్స్ రూపంలో సంవత్సరానికి రూ. 1000 కోట్లు ఇస్తున్నారని, అటువంటి ఆంద్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న ఉద్యమంపై ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని రవిచంద్‌ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ప్రత్యేక హోదా కోసం ఉద్యమించేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకు రావాలని డిమాండ్ చేస్తూ విజయవాడ పున్నమి ఘాట్ లో సినీ నిర్మాత రవిచంద్ జలదీక్ష చేసారు.

cinema 1052018 3

ప్రజలకు అన్యాయం జరిగినా పెద్ద హీరోలు , నిర్మాతలు, దర్శకులు స్పందించరా అని అయన ప్రశ్నించారు. వారికి సమస్యలు వస్తే వెంటనే సమావేశాలు పెట్టుకునే వాళ్లు .. ప్రజల కోసం ఎందుకు బయటకు రారు. ఆదివారం ఒక వేదిక ఏర్పాటు చేసుకుని హోదా కోసం ఉద్యమించాలని అయన అన్నారు. తమిళ హీరోలను చూసి అయినా తెలుగు హీరోలు బుద్ది తెచ్చుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమ ఉద్యమించేంత వరకు వివిధ రూపాలలో నా ఆందోళన కొనసాగిస్తానని అన్నారు. జల్లికట్టు, రైతుల సమస్యల గురించి తమిళ సినీ పరిశ్రమ ఏ విధంగా పోరాడిందో అందరికీ తెలుసని, ఆ మాదిరిగా మన హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎందుకు స్పందించరు? అని ప్రశ్నించారు.

cinema 1052018 4

ఈ విషయమై స్పందించమని కోరుతూ ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మా అసోసియేషన్ కు తాను ఇప్పటికే లేఖలు రాశానని, ఈ లేఖలను చూసి అక్కడి పెద్దలు నవ్వుకున్నారని తనకు సమాచారం ఉందని చెప్పారు. ఈ విషయం తెలిసి తనకు చాలా బాధ కలిగిందని, సినీ పరిశ్రమ పెద్దలు దిగొచ్చే వరకూ ఈ పోరాటం చేయాలని నిశ్చయించుకున్నట్టు చెప్పారు. ‘హోదా’ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు హీరో లెవ్వరూ ఆందోళనలకు దిగాల్సిన అవసరం లేదని, ప్రతి నెలా రెండో ఆదివారం దీక్ష చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆరు నెలల పాటు పోరాటం చేద్దామని, అలా చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే.. స్ట్రయిక్ చేద్దామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, హామీల అమలు విషయమై తెలంగాణ ప్రభుత్వమే సపోర్టు చేసిందని, పక్క రాష్ట్రాల్లో హీరోలకు ఉన్న బుద్ధిజ్ఞానం కూడా మీకు లేదా? అంటూ రవిచంద్ మండిపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read