ఈ రోజు గుంటూరు జిల్లా పత్తిపాడులో, పెన్షన్ కార్యక్రమంలో పాల్గున్న జగన్ మోహన్ రెడ్డి, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా సినిమా రంగాన్ని టార్గెట్ చేస్తూ, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినీ పరిశ్రమకు సంబంధించి, వినోదాన్ని పేదలకు అందించేందుకు టికెట్లు ధరలు తగ్గించామని, ఇది కూడా తప్పు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, పరోక్షంగా సినీ పరిశ్రమ పెద్దల పై సంచలన వ్యాఖ్యలు చేసారు. టికెట్ల తగ్గింపు వ్యవహారం మూలంగా ఎటువంటి భారం సినీ పరిశ్రమ పైన, ధియేటర్ల్ పైన పడుతుందనేది మాత్రం, ఆయన పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా 83 ధియేటర్లను సీజ్ చేసింది. వీటిలో 22 ధియేటర్లకు లైసెన్స్ లేదని ప్రభుత్వం చెప్తుంది. 25 ధియేటర్లకు ఫైన్ వేశామని, ఆ ఫైన్ కట్టే వరకు అది తీయటానికి వీలు లేదని చెప్పింది. మొత్తంగా చూసుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా 1100 ధియేటర్లు దాదాపుగా 130 ధియేటర్లు ఇప్పటికే మూసివేసారు. సినీ పరిశ్రమ ముదలైనప్పటి నుంచి, ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ ఇలాంటి సంక్షోభాన్ని సినీ పరిశ్రమ చూడలేదు. ఒక వైపు అటు సినీ పరిశ్రమ నుంచి, ఇటు విపక్షాల నుంచి అటు సాధారణ ప్రజలు, అభిమానుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురు అవుతున్నా కూడా, ప్రభుత్వం ఒప్పుకోలేదు.

jagan 01012022 2

పైగా ఈ రోజు సినీ పరిశ్రమనే నిందిస్తున్నారు. ఇప్పటికే హీరో నాని, హీరో సిద్ధార్ద్ బహిరంగంగా వచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బట్టారు. అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం, సినిమా టికెట్ రేట్లను పెంచమని అనే వాళ్ళు అందరూ, ఆంటీ పూర్ అంటే, పేదవాళ్ళ వ్యతిరేకులు అంటూ, సినీ పరిశ్రమలో టికెట్ల ధరలు పెంచమని అడిగే వారందరికీ కౌంటర్ ఇచ్చారు. తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ, పేదవాళ్ళకు తక్కువ ధరలకే సినిమా చూపించటం తప్పా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ధియేటర్లలో పని చేసేది అంతా పేదవాళ్ళే ఉంటారు. సుమారుగా ఒక్కో ధియేటర్ లో, 20 నుంచి 25 మంది ఆధార పడి ఉంటారు. మొత్తం 1100 ధియేటర్లలో ఎంత మంది ఎఫెక్ట్ అవుతారు, అలాగే పరోక్షంగా ఆధార పడిన వారు, సినీ పరిశ్రమ ఇలా వీళ్ళ గురించి మాత్రం పట్టించుకోలేదు. ఎవరిని టార్గెట్ గా చేసుకుని జగన్ ఈ వ్యాఖ్యలు చేసారో తెలియదు కానీ, సినీ వర్గాలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read