అమరావతిని మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకుంటూ, వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లులు తేవటం వెనుక కూడా అభ్యంతరాలు ఉన్నాయి. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీలో ఉన్నది అని ఒకరు, అలాగే పునర్విభజన చట్టం మార్చాలని, ఇలా అనేక వాదనలు వినిపించినా, ప్రభుత్వం గవర్నర్ చేత బిల్లులు ఆమోదింప చేసుకుంది. అయితే దీని పై రైతులు హైకోర్టు తలుపు తట్టారు. ఇది వరుకే అమరావతి పై అనేక పిటీషన్లు ఉండటంతో, రైతులు హైకోర్టు తలుపు తట్టటంతో, హైకోర్టు ఈ విషయం పై స్టేటస్ కో విధిస్తూ, యదాతధ స్థితి కొనసాగించాలని, విచారణ వాయిదా వేసింది. అయితే హైకోర్టు స్టేటస్ కో ఇవ్వటం పై, ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టింది. వెంటనే విచారణ చెయ్యాలని కోరగా, పిటీషన్లో అనేక తప్పులు ఉండటంతో, సుప్రీం కోర్టు అది తిప్పి పంపించింది. మళ్ళీ తప్పులు సరి చేసి పంపించటంతో, సుప్రీం కోర్టులో ఈ కేసు ఈ రోజు లిస్టు అయ్యింది.

అందరూ ఏమి జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురు చుస్తున్న సమయంలో, అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే ధర్మనాసం ముందుకు వచ్చింది. అయితే దీని పై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. దానికి కారణం హైకోర్టులో రైతులు తరుపున చీఫ్ జస్టిస్ బాబ్డే కుమార్తె, రుక్మిణీ బాబ్డే, వాదనలు వినిపించారు. ఈ విషయం చీఫ్ జస్టిస్ ముందు ప్రాస్తావన చెయ్యటంతో, వెంటనే చీఫ్ జస్టిస్ బాబ్డే ఈ కేసుని ఈ బెంచ్ వాదించదని, వేరే బెంచు ముందు ఈ కేసు లిస్టు చెయ్యాలని ఆదేశించారు. దీంతో ఈ కేసు విచారణ వేరే ధర్మాసనం ముందు, విచారణకు రానుంది. బుధవారం ఈ కేసు విచారణ మళ్ళీ సుప్రీం ముందుకు రానుంది. మొత్తానికి ఈ రోజు ఏమి జరుగుతుందా అని టెన్షన్ లో చూసిన వారికి, మళ్ళీ బుధవారం వరకు ఆగాల్సిన పరిస్థితి. అయితే చీఫ్ జస్టిస్ వేరే బెంచ్ కు కేసుని బదిలీ చెయ్యటం పై, ప్రశంసలు వస్తున్నాయి. ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా మంచి నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read