సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది కాలంగా నలుగుతున్న కేసులో, ఎన్వీ రమణ సంచలన ఆదేశాలు ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్ యోగి సర్కార్, తమ వాదనలు గట్టిగా వినిపించినా, చీఫ్ జస్టిస్ బెంచ్ మాత్రం , వారి వాదనలు తోసిపుచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే, హాత్రస్ లో దళిత యువతికి జరిగిన అ-త్యా-చా-ర సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సంఘటన కవర్ చేయటానికి వెళ్ళిన కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ పై, UAPA చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. సుదీర్ఘకాలంగా ఆయన జైల్లోనే మగ్గుతున్నారు. అయితే, గత ఏడాది కాలంగా ఈ కేసు విషయమై అతనికి న్యాయం జరగలేదు. సిద్దిక్ కప్పన్ ఆరోగ్యం బాగోక పోవటం, కో-వి-డ్ బారిన పడటంతో, మధురలోని ఒక హాస్పిటల్ లో, ఆయన్ను ఒక మంచం పై కట్టేసి, జంతువులాగా చూస్తున్నారని, కనీసం టాయిలెట్ కు కూడా వెళ్ళనివ్వకుండా, డబ్బాలు పెడుతున్నారని, సరైన ఆహరం కూడా ఆయనకు అందించటం లేదని, ఇలాగే చేస్తే అతను చనిపోయే అవకశం ఉంది అంటూ, కేరళ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ , సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఆయనకు వేసిన చైన్లు తొలగించి, సత్వరమే, మంచి వైద్యం అందించకపోతే, ఆయన చ-ని-పో-యే అవకాసం ఉందని వాదించారు. అలాగే సిద్దిక్ భార్య రైహంత్ కప్పన్ కూడా, ఈ విషయాలు అన్నీ ప్రస్తావిస్తూ, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు లేఖ కూడా రాసారు. ఈ పిటీషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణకు స్వీకరించింది. తమకు బెయిల్ కంటే ముందు, హెల్త్ ఎమర్జెన్సీ ముఖ్యం అని, మంచి వైద్యం అందించాలని కోరారు.
దీనికి స్పందించిన బెంచ్, ఆయన ఎలాంటి నేరాలు చేసారో అనేది పక్కన పెడితే, అతనికి అనారోగ్యం ఉంటే, చికిత్స అందించటం అనేది ప్రధాన బాధ్యత అని, అతనికి ఢిల్లీలోని ఒక ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇది ఇలా ఉంటే, యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ వాదిస్తూ, అతనికి కరుడుగట్టిన ఉ-గ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని, ఆర్ధిక ప్రయోజనాలు కూడా పొందాడని, అలాంటి వాడి పై జాలి చూపించకూడదని వాదించారు. అతను వైద్యులకు సహకరించకుండా, కులం, మతం అడ్డుపెట్టుకుని బెయిల్ కోసం చూస్తున్నారని వాదించారు. దీనికి స్పందించిన కోర్టు, మీరు చెప్తున్న ఉ-గ్ర సంస్థ పై పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిషేధం విధించలేదు కదా, అయినా అతని బ్యాంక్ లావాదేవీలు చూస్తే. 25 వేలు కూడా లేవు, దానికి వైద్యానికి ముడిపెట్టటం కరెక్ట్ కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని, కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో సుప్రీం ఇచ్చిన ఆదేశాల పై, పలువురు సంతోషం వ్యక్తం చేసారు. ఈ కేసుని యోగి ప్రభుత్వం ప్రతిష్టగా తీసుకున్నా, చీఫ్ జస్టిస్ బెంచ్ ఎక్కడా ఒత్తిడికి తలొగ్గకుండా, సరైనా తీర్పు ఇచ్చిందని హర్షం వ్యక్తం చేసారు.