ప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇవ్వడంలో టీడీపీ మంత్రులు విఫలం అయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఉదయం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం మంత్రులతో భేటీ అయ్యారు. సుమారు గంటన్నరపాటు మంత్రులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. దేనికైనా తానే సమాధానం చెప్తున్నానని, మంత్రులు ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. మంత్రులుగా ఉండి సీరియస్‌నెస్‌ లేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. మంత్రులందరి పనితీరును గమనిస్తున్నానని, కేటీఆర్ విమర్శలపై ఎందుకు స్పందించడంలేదని చంద్రబాబు మంత్రులను ఉద్దేశించి ప్రశ్నించారు.

cabinet 25022019 2

జగన్, కేసీఆర్, మోదీ కలిసి కుట్ర చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. వాళ్లు డబ్బుల మూటలతో వస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని అన్నారు. మనం పోటీ చేయడం లేదని మంత్రులతో చంద్రబాబు అన్నారు. జాతీయ రాజకీయాలను గమనిస్తూ ఉండాలని ఈనెల 28న బీజేపీయేతర పక్షాల సమావేశం జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ముందస్తుగానే కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంచేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తూ ఉండదనే విషయాన్ని మరోసారి చంద్రబాబు తేల్చి చెప్పారు.

cabinet 250220193

జాతీయ జల అవార్డుల్లో రాష్ట్రానికి మూడో స్థానం దక్కడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖకు సీఎం ఆయన అభినందనలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై నిర్వహించిన సమీక్షలో అధికారులను చంద్రబాబు ప్రశంసించారు. ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటివరకు 66.36 శాతం పూర్తయిందని.. కాంక్రీట్‌ పనులు 65.30 శాతం, కాంక్రీట్ పనులు 65.30 శాతం, పూర్తి అయ్యాయని, తవ్వకం పనులు 82.60 శాతం, కుడి ప్రధాన కాలువ 90.29 శాతం, ఎడమ ప్రధాన కాలువ 68.74 శాతం, ఎగువ కాఫర్ డ్యామ్ 25.73 శాతం, దిగువ కాఫర్ డ్యామ్ 10.17 శాతం పూర్తి అయ్యాయని, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ వర్క్ 62.83 శాతం పూర్తి చేశామని సీఎం తెలిపారు. పోలవరం పనుల పురోగతిపై 89వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read