రాష్ట్రస్థాయిలో ఆరోగ్య సూచికల్లో ఆశా వర్కర్లది కీలక పాత్ర అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండ‌వ‌ల్లిలోని సీఎం నివాసం స‌మీపంలో ఉన్న ప్రజాదర్బార్ హాలులో శుక్ర‌వారం “ఆశాలకు బాసట” పేరిట ఆయన ఆశా వర్కర్లతో సమావేశం నిర్వ‌హించి వారికి వరాలు కురిపించారు. నెలకు కనీస వేతనం రూ.3వేలు తప్పనిసరి చేస్తున్నట్టు చెప్పారు. వారికి స్మార్ట్‌ఫోన్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే వారికి నెలకు రూ.6వేలు నుంచి 8వేలు వచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. ప్రజల్లో పౌష్టికాహారం, పరిశుభ్రతపై నిత్యం అవగాహన కల్పిస్తున్నారని, రోజు రోజుకు జీవన ప్రమాణాలు పెరగాలని సూచించారు.

anganvadi 29062018 2

ఆనందం, ఆరోగ్యం పెరిగి ప్రపంచంలో పదో స్థానంలో నిలవాలని ఆకాంక్షించిన చంద్రబాబు అందుకనుగుణంగా ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలని వారికి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశావర్కర్లంతా ఆదర్శంగా నిలవాలని కోరారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా రూ.3000 స్థిర వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. వేత‌నాలు పెంచ‌డం ఫ‌లితంగా రూ.156 కోట్లు అదనంగా ప్రభుత్వంపై భారం పడుతోంద‌న్నారు. రూ.312 కోట్లు ఇందుకోసం నిధులు ఖర్చు చెయ్యడం జరుగుతోంద‌ని తెలిపారు.

anganvadi 29062018 3

రాష్ట్రంలో రూ.3000 వేలు చొప్పున ఆశా కార్యకర్తలకు ఫిక్సడ్ గౌరవ వేతనం 1వ తేదీ నుంచి ఇవ్వడం జరుగుతుంద‌ని, ఆశా కార్యకర్తలకు ఏఎన్‌ఎం పోస్టుల భ‌ర్తీలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన‌ట్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 43 వేల మంది ఆశా వర్కర్లు ఉన్నార‌ని తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం అని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు ఆరోగ్య నిపుణులుగా ఎంతో సేవలు అందిస్తున్నార‌ని ప్ర‌శంసించారు. “ఆశాలకు బాసట” గా కార్యక్రమంలో హెల్త్ డైరెక్టర్ ఎస్.అరుణకుమారి, ఎస్పీఎం జి.వాసుదేవరావు, జెడి సావిత్రి, ప్రోగ్రాం అధికారిణి నాగమల్లేశ్వరి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read