జనం మెచ్చి నేత.. సమస్యల పరిష్కారంలో ఘనత ఆపన్నులను ఆదుకొంటూ సాంత్వన చేకూరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.... రోజు రోజుకు ప్రజాదరణ పొందుతున్న ప్రజావేదిక... ప్రతి సోమవారం తమ సమస్యలను పరిష్కరించుకునే ప్రక్రియలో ప్రజలు రాష్ట్రం నలుమూలల నుండి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రతి ఒక్కరి సమస్యలను వినడం అక్కడికి అక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, సమస్యలు పరిష్కారం కావడంతో ప్రజావేదికకు ప్రజాదరణ పెరుగుతూ ఉంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ద వహించి ప్రజా సమస్యల పరిష్కరించడం ప్రజల సంతృప్తి స్థాయిని పెంచుతుంది.
రాష్ట్రంలో 1100 ద్వారా ఆన్లైన్లో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నా. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో శాఖాధిపతులు, కార్యదర్శులు కూడా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలోనూ ప్రతి సోమవారం భారీ సంఖ్యలో ప్రజలు ప్రజావేదికకు వస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం భారీ సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకుని పరిష్కరించుకునేందుకు ప్రజావేదికకు వచ్చారు. ముఖ్యమంత్రి ఓపికగా ప్రతి ఒక్కరి సమస్య సావధానంగా విని వారి సమస్యలు అక్కడికి అక్కడే పరిష్కరించారు.
ముఖ్యంగా వికలాంగులు తమ సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పగా వెంటనే వాటిని పరిష్కరించారు. పేద ప్రజలకు సంబంధించిన పింఛన్లు, గ్రామీణ గృహనిర్మాణం, మంజూరు, చెల్లింపులు, త్రాగునీటి సమస్యలు, అక్కడికక్కడే పరిష్కరించారు. వయోవృద్దులకు వైద్య ఖర్చుల కొరకు ఆర్ధిక సహాయం మంజూరు చేశారు. వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు, శస్త్రచికిత్సలు కొరకు ఆర్ధిక సహాయం మంజూరు చేశారు. అలాగే వివిధ వైద్య ఖర్చులకి, అధికంగా డబ్బులు కావాల్సి ఉన్న పేద వారు, వారి సమస్యలు చెప్పగానే, వాటిని పరిశీలించి, పెద్ద ఎత్తున సియం రిలీఫ్ ఫండ్ నుంచి, మంజూరు కూడా చేసారు.