ఆర్ధిక రాజధాని ముంబైలోని బొంబాయి స్టాక్ ఎక్ఛేంజ్ (బీఎస్ ఈ) లో నిర్వహించే అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ (ఆదివారం) రాత్రి ముంబై కి చేరుకుంటారు. 27న(సోమవారం) ఉదయం 9 గంటలకు బీఎస్ఈ కి వెళ్తారు. అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం అనంతరం.. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముంబై నగరంలో ముఖ్యమంత్రి పర్యటన సాగబోతుంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.
ముఖ్యంగా టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా, ప్రస్తుత ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ లతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఆయన పలువురు కీలక వ్యాపారవేత్తలను కలుసుకోనున్నారు. అనంతరం రిలయన్స్ ఇండస్డ్రీస్ అధినే ముఖేష్ అంబానీ, రిలయన్స్ సీఈవో పీఎంఎస్ ప్రసాద్ లతో భేటీ కానున్నారు. ఆతర్వాత గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఎండీ నడియార్ గోద్రేజ్ తో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అనంతరం మహేంద్ర వరల్డ్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్ సీవోవో సంజయ్ శ్రీవాత్సవతో సీఎం భేటీ కానున్నారు. ఆ తర్వాత స్క్వేర్ గ్రూప్ ఛైర్మన్ బాలన్ తో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు.
అనంతరం ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమారమంగళంలో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఆ తర్వాత వెల్సపన్ గ్రూప్ ఛైర్మన్ బీ. కే గోయింకా తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. అనంతరం పిరామిల్ గ్రూప్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఆ తర్వాత లోథా గ్రూప్ ఛైర్మన్ మంగళ ప్రభాత్ లోధాతో కూడా ముఖ్యమంత్రి భేటీ అవుతారు. అనంతరం ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర తో కూడా ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఈ పర్యటనలో భాగంగా గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్, సెయింట్ గోబెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రహేజా గ్రూప్, టాటా ఇంటర్నేషనల్, హల్దియా పెట్రోకెమికల్స్ సంస్థల ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రేపు రాత్రి ముఖ్యమంత్రి తిరిగి విజయవాడ చేరుకుంటారు.