విభజన చట్టంలో హామీలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ శాసనభ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రధాని ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు న్యాయం కోసం పోరాడతానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని తెలిపారు. విభజన ఇంకా పూర్తవ్వలేదని అన్నారు. విభజన కష్టాల నుంచి గట్టెక్కిస్తారనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ, విజయసాయి రెడ్డి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..
బీజేపీలో జరిగే కీలక నిర్ణయాలన్నీ వైసీపీకి ముందే ఎలా తెలుస్తున్నాయని సీఎం అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ముందే ఎలా తెలిసింది?. కోవింద్ బీహార్ గవర్నర్గా ఉన్నప్పుడే సాయిరెడ్డి వెళ్లి కలిశారు. ఆర్థిక నేరస్తులకు అధికారం దగ్గర అంత స్వేచ్ఛ ఉండకూడదు. టీడీపీ.. ఎన్డీఏలో ఉన్నా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా చెప్పే వరకూ నాకు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో తెలియదు అని చంద్రబాబు అన్నారు..
మోదీ ప్రత్యేక హోదా ఇస్తారని పూర్తి విశ్వాసం ఉందని విజయసాయి అంటున్నారు. అలాంటప్పుడు వైసీపీ అవిశ్వాసం ఎందుకు పెడుతుందో అర్దం కావడం లేదని అన్నారు... వైసీపీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలేసి నన్ను విమర్శిస్తోందని, ప్రజలు మోస పోరని, వైసీపీని శాశ్వతంగా శిక్షిస్తారని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ-1, ఏ-2 నిందితులు ప్రధానిని ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు. దోచుకున్న ఆస్తులు రికవరీ చేసి రాష్ట్రానికి ఇవ్వాలని ప్రధాని మోదీని కోరినట్లు చంద్రబాబు చెప్పారు...