ఎన్నికల్లో విజయం సాధించిన జగన్మోహన్‌రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. భారీ విజయం సొంతం చేసుకున్న ప్రధాని మోదీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీకి ప్రతికూలంగా వచ్చిన తర్వాత తొలిసారిగా ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. గురువారం రాత్రి ప్రజావేదికలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం గెలుపునకు రాత్రింబవళ్లు కృషిచేసిన పార్టీ కార్యకర్తలు, ఓటేసిన ప్రజలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకుని భావి కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు. ఫలితాల్ని గౌరవించడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా.. వెంటనే ఆమోదం.. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం మధ్యాహ్నమే తన పదవికి రాజీనామా సమర్పించారు.ఈ మేరకు గవర్నర్ నరసింహన్‌కు లేఖను ఫాక్స్‌ద్వారా పంపారు. దీని వెంటనే అమోదించినట్లు గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కలిశారు. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ అంటున్నారు.