పిఠాపురం ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఏన్ వర్మ, నిన్న తన నియోజకవరంగలో గ్రామదర్శిని కార్యక్రమంలో ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో, అక్కడ అందరూ అలెర్ట్ అయ్యారు. ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఏన్ వర్మ నిన్న, గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా, బి.ప్రత్తిపాడు గ్రామంలో పర్యటించి, ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా, తన సెల్ ఫోన్ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా, బి.ప్రత్తిపాడు గ్రామంలో పర్యటన చేస్తున్నాను అని ఎమ్మెల్యే చంద్రబాబుకి చెప్పగా, చంద్రబాబు స్పీకర్ ఆన్ చెయ్యమని చెప్పారు. నేను అక్కడ ఉన్న గ్రామస్తులతో మాట్లాడాలి, స్పీకర్ ఆన్ చెయ్యండి అని కోరారు.
ఈ సందర్భంగా, చంద్రబాబు అక్కడ ఉన్న గ్రామస్తులతో మాట్లాడతూ, అన్ని పధకాలు సకాలంలో అందుతున్నాయా లేదా అని ఆరా తీసారు. మిగతా సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎమ్మల్యేతో మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న పధకాల గురించి, ప్రజలకు వివరించాలని, వాళ్లకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించాలని కోరారు. తెలుగుదేశం సానుభూతి పరులే కాకుండా, అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవాలని, అర్హులకు ప్రభుత్వం అందించే అన్ని పధకాలు అందేలా చూడాలని అని అన్నారు. అలాగే మహిళా సంఘాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, వారిని బలోపేతం చెయ్యాలని కోరారు.
దీనికి ఎమ్మల్యే స్పందిస్తూ, అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే మహిళా సంఘాలతో సమావేశం అయినట్టు, ముఖ్యమంత్రితో చెపారు. బి.ప్రత్తిపాడు గ్రామంలో పోయిన ఎన్నికల్లో 1800 ఓట్లు వచ్చాయని, ఈ సారి వచ్చే ఎన్నికల్లో 2300 దాకా తెలుగుదేశం పార్టీకి వస్తాయని, ముఖ్యమంత్రికి చెప్పారు. సాధికార మిత్ర, మహిళా సంఘాలు, బూత్ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి అనుకోకుండా ఫోన్ చెయ్యటం, స్వయంగా తమతో మాట్లాడటంతో, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రికి మాకు ఉన్న సమస్యలు చెప్పమని, ఎమ్మల్యే చొరవతో, అవి పుర్తవుతాయనే నమ్మకం ఉందని అన్నారు.