సతీష్ రెడ్డి గుర్తున్నాడా. పులివెందులలో, వైఎస్ ఫ్యామిలీకి తరతారాలుగా, ప్రత్యర్ధి ఈయనే. ప్రస్తుతం ఈయనా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్. ఈయనకు ఎటువంటి క్రిమినల్ చరిత్ర లేదు. ప్రతి సారి వైఎస్ ఫ్యామిలీ చేతిలో ఓడిపోతూ వచ్చినా, వైఎస్ ఫ్యామిలీ ఎలాంటిదో తెలిసినా, దశాబ్దాలుగా వారితో పోరాడుతూ, ప్రజల తరుపున ఉన్నారు. పులివెందులలో పరిస్థితి చూసిన సతీష్ రెడ్డి, మూడేళ్ళ క్రితం, గండికోట రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను పైడిపాళెం ప్రాజెక్టుకు తీసుకొచ్చి పులివెందుల ప్రాంత రైతులకు నీరు అందిస్తానని, అప్పటి వరకు గడ్డం తియ్యను అని ఛాలెంజ్ చేసారు. దాదాపుగా 18 నెలలుగా దీక్ష చేస్తూనే ఉన్నారు. పులివెందులలో నీళ్లు పారితేగానీ గడ్డం తీయనన్నారు. అన్నట్లుగానే దాదాపు మూడేళ్ళ పాటు గడ్డం తీసుకోలేదు.
ఎందుకంటే, అది మన సంకల్పాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అంటారు. అప్పటి నుంచి, ఈ ప్రాజెక్ట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వంతో మాట్లాడటం, ఇరిగేషన్ అధికారులతో నిత్య సంప్రదింపులు, నిర్వాసితులను బుజ్జగించటం లాంటి ఎన్నో పనులు చేస్తూ, ప్రాజెక్ట్ పనుల వేగాన్ని పెంచి, మొత్తానికి పోయిన ఏడు పులివెందులలో నీళ్ళు పారించారు. ఇది సంకల్పం. ప్రజలకు మంచి చెయ్యాలనే సంకల్పం ఉంటే, ఏదైనా సాధించ వచ్చు అనే దానికి, ఇది ఒక ఉదాహరణ. అయితే, ఇప్పుడు సతీష్ రెడ్డి స్పూర్తితో, రాజ్యసభ సభ్యుడు సియం రమేష్ కూడా, ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించి, కడప ఉక్కు పరిశ్రమ వచ్చే వరకు, గడ్డం తియ్యను అని చెప్పారు.
11 రోజులు కడప స్టీల్ ప్లాంట్ కోసం, సియం రమేష్ దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు రమేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం తలపెట్టిన దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రేపు అనంతపురంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. కర్మాగారం నిర్మాణానికి పునాది వేసే వరకు గడ్డం తీయనని శపధం చేశారు. ప్రతి క్షణం, ఇది నా కర్తవ్యం గుర్తు చేస్తూ ఉంటుందని, కడప స్టీల్ ప్లాంట్ కోసం, అన్ని ప్రయత్నాలు చేసి సాధిస్తానని చెప్పారు. రాజకీయాల్లో ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ఉండే ఛాలెంజ్ లు ఉంటే, అటు ప్రజలకీ లాభం ఉంటుంది, మంచి పనులు చేస్తున్నారు అనే ఇమేజ్ రాజకీయ నాయకులకి వస్తుంది... ఉత్తమ కుమార ప్రగల్భాలు పలకటం కాదు, ఇలా పనులు చేసి ప్రజల మనసులు గెలవాలి. సియం రమేష్ ఆశయంతో పాటు, కడప ప్రజల ఆశయం కూడా నెరవేరాలని కోరుకుందాం.