పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సభ్యుడిగా సీఎం రమేష్‌ ఎన్నికయ్యారు. 106 ఓట్లతో టీడీపీ ఎంపీ రమేష్ గెలుపొందారు. 69 ఓట్లతో బీజేపీ ఎంపీ భూపేంద్రయాదవ్ ఎన్నికయ్యారు. ఇక జేడీయూ అభ్యర్థి మాత్రం ఓటమి చవిచూశారు. కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, సీపీఎం, సీపీఐలు రమేష్‌కు ఓటేశాయి. సీఎం రమేష్ ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభలో ఆయన ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తన గళాన్ని విప్పుతున్నారు. విభజన హామీల అమలుపై రాజ్యసభ వేదికగా కేంద్రాన్ని నిలదీస్తున్నారు. అంతేకాదు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ 11 రోజుల పాటు దీక్ష చేశారు. దీక్ష విరమించడం మంచిదని వైద్యులు చెప్పినప్పటికీ ఎంపీ తన దీక్షను కొనసాగించారు. ప్లాంట్‌ వచ్చే వరకు పోరాటం ఆగదని అప్పట్లో స్పష్టం చేశారు. సీఎం రమేష్ దీక్షకు ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఆయన దీక్షను విరమించారు.

ramesh 06082018 2

కేంద్ర ప్రభుత్వ వ్యయాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) పార్లమెంటుకు సమర్పించే నివేదికను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లేదా ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) పర్యవేక్షిస్తుంది. ఇదే ఈ కమిటీ ప్రధాన విధి. ఇది భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే కొనసాగుతోంది. ప్రజాపద్దుల కమిటీ ఏర్పాటు పార్లమెంటు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో 22 మంది ఎంపిక చేసిన ఎంపీలు (15 మంది లోక్‌సభ, 7 మంది రాజ్యసభ) సభ్యులుగా ఉంటారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి ఒక సభ్యుడిని చైర్మన్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సభ్యుడి ఎంపికను పార్లమెంటు స్పీకర్ చూసుకుంటారు.

ramesh 06082018 3

రైల్వే, రక్షణ, పోస్టల్ శాఖలతో పాటు ఇతర ప్రధాన పౌర శాఖలకు సంబంధించిన వ్యయాలపైన కమిటీ పర్యవేక్షణ జరుపుతుంది. పార్లమెంటు ద్వారా ఏ శాఖలకు ఎంత నిధులు మంజూరయ్యాయి. వాటి వినియోగం, ఖర్చులపై ఆరా తీస్తుంది. అలాగే వివిధ శాఖల వ్యయాలపై కాగ్ ఇచ్చిన నివేదికలపైనా పరిశీలన జరుపుతుంది. ఆయా శాఖలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని అధికంగా ఖర్చు పెడుతున్నాయో ? లేదా? పర్యవేక్షణ జరుపుతుంది. అంటే కేవలం పెట్టిన ఖర్చులపై మాత్రమే కాకుండా పెడుతున్న ఖర్చులపై కూడా కన్నేసి ఉంచుతుంది. ఆయా శాఖల ఖర్చుల పద్దులపై ఉన్న అభ్యంతరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. వాటిని యథాతథంగా పార్లమెంటు ముందు ఉంచుతుంది. 2011లో 2జీ కుంభకోణంలో జరిగిన అవకతవకల్ని ప్రజా పద్దుల కమిటీ ప్రజల దృష్టికి తీసుకువచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read