తెలుగుదేశం పార్టీ పై పన్నిన అతి భారీ కుట్ర బయట పడింది. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను సీబీఐ కేసులో ఇరికించేందుకు పన్నిన అతి భారీ కుట్ర బయట పడింది. నిన్నటి నుంచి సిబిఐలో జరుగుతున్న పరిణామాలు తెలిసిందే. వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ, అరెస్ట్ లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలోని రమేష్ ని సిబిఐ కేసులో అరెస్ట్ చేసే కుట్ర బయట పడింది. సతీష్‌బాబు సానా అనే వ్యక్తి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రమేష్ పేరు ప్రస్తావించినట్లు ఒక స్టేట్‌మెంట్‌ను సృష్టించారు. ఆ స్టేట్‌మెంట్‌ను సృష్టించిన విచారణ అధికారి అయిన సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్‌ని సీబీఐ అధికారులు ఈ రోజు అరెస్టు చేశారు.

cbi 22102018 2

సెప్టెంబర్ 26న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం సతీష్‌బాబు సానా ఒక వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్ తప్పుడు సాక్ష్యాలను సృష్టించారు. అయితే ఆ రోజు సతీష్ అసలు ఢిల్లీలో లేరని విచారణలో వెల్లడైంది. దాంతో ఈ ఘటన పై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపి దేవేందర్‌ను అరెస్ట్ చేశారు. వాస్తవానికి విచారణలో సతీష్ సానా ఇచ్చిన వాంగ్మూలానికి, దేవేందర్‌కుమార్ నమోదు చేసిన వాంగ్మూలానికి సంబంధం లేదని అధికారులు తేల్చారు. సీఎం రమేష్ పేరును సతీష్ సానా చెప్పకపోయినా డీఎస్పీ దేవేందర్ కుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు గుర్తించారు.

cbi 22102018 3

సతీష్ సానా ఢిల్లీలో ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదని, సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్ తప్పుడు స్టేట్‌మెంట్‌ను సృష్టించారని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఇదంతా సియం రమేష్ ని ఎదో కేసులో ఇరికించే కుట్రలో భాగంగా, పై నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్‌, తప్పుడు స్టేట్మెంట్ సృష్టించారు. ఇలా ఎందుకు చేసారు, ఎవరి ఒత్తిడి మేరకు చేసారు అనే విషయం విచారణలో తేలనుంది. ఇటీవల సీఎం రమేష్‌ ఇంట్లో ఐటీ సోదాలు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటి సియం రమేష్ ఇళ్ళ పై దాడులు చేసి, హడావిడి చేసి, ఉత్తి చేతులతో ఊపుకుంటూ వెళ్లారు. ఇప్పుడు ఈ కుట్ర బయటపడటంతో, ఇది ఏ టర్న్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read