ఐటీ దాడులపై తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, తన భార్య పేరు మీద నోటీసులు వచ్చాయని ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆరు నెలల క్రితం ఐటీ దాడులు జరిగాయని, మళ్లీ ఇప్పుడు ఐటీ దాడుల పేరుతో సోదాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ఐటీ సోదాలు చేస్తున్నారని, రిత్విక్ కంపెనీలో సోదాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఐటీ అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు. ఐటీ అధికారులు సహకరిస్తే తన ఇంట్లో జరిగే సోదాలను.. వీడియో తీసి మీడియాకు పంపిస్తానని రమేష్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం సీఎం రమేష్‌ హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

itramesh 13102018 2

ఐటీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులను నిన్నటి నుంచి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు పిలవడంతో హైదరాబాద్‌ వచ్చానని, ఐటీ దాడులను న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. ఐటీ అధికారుల సోదాలకు పూర్తిగా సహకరిస్తామని సీఎం రమేష్‌ తెలిపారు. సీఎం రమేశ్‌ నివాసాలు, కార్యాలయాలపై ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం దాదాపు 60 మంది ఐటీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు చేశారు.

itramesh 13102018 3

ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నివాసం, కడప జిల్లా పోట్లదుర్తిలోని నివాసంతో పాటు రిత్విక్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, దాని అనుబంధ సంస్థల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని 12 చోట్ల, పోట్లదుర్తి ఇతర ప్రాంతాల్లో ఐదు చోట్ల ఈ తనిఖీలు కొనసాగాయి. భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుపై సీఎం రమేశ్‌ విమర్శలు గుప్పించారు. జీవీఎల్‌ ఏమైనా ఐటీ అధికారా? అని ప్రశ్నించారు. ఆయనపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని రమేశ్‌ స్పష్టం చేశారు. ఐటీ అధికారుల సోదాల నేపథ్యంలో దిల్లీ నుంచి హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read