తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు వాట్సాప్ యాజమాన్యం షాకిచ్చింది. తన వాట్సాప్ ఖాతా పనిచేయడం లేదని రమేశ్ ఇచ్చిన ఫిర్యాదుకు ఆ సంస్థ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. మీరు వాట్సాప్ సేవలు వాడుకునేందుకు అర్హత కోల్పోయారంటూ ఆ సంస్థ చెప్పడంతో ఆయన షాక్‌కు గురయ్యారు. ఆయన ఖాతాపై అనేక ఫిర్యాదులు రావడంతో పరిశీలించి చివరకు బ్యాన్ చేసినట్లు చెప్పింది. అయితే కంప్లైంట్స్ ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు అన్న దానిపై మాత్రం యాజమాన్యం స్పష్టత ఇవ్వలేదు. సీఎం రమేశ్ వాట్సాప్ ఖాతా బ్యాన్‌కు గురైన సంగతి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ramesh 09022019

కేంద్ర తన ఫోన్‌, వాట్సాప్ ఖాతాపై నిఘా పెట్టడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రమేశ్ అనుమానిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఆయన న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఎప్పటి నుంచో ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ నేతలు సైతం ఇలాంటి ఆరోపణలు చేశారు. టీడీపీలో కీలకనేతగా, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్న సీఎం రమేశ్ కేంద్రంపై ఎన్నోసార్లు తీవ్ర ఆరోపణలు చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష సైతం చేశారు.

ramesh 09022019

ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు ఆయన ఆస్తులపై దాడులు చేయడం కలకలం రేపింది. విభజన హామీలపై పోరాడుతున్నందునే తమపై కేంద్రంపై కక్ష గట్టిందని రమేశ్ ఆరోపించారు. ఇప్పుడు ఆయన వాట్సాప్ ఖాతా బ్యాన్ కావడం వెనుక కేంద్రం కుట్ర ఉండొచ్చని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. సంస్థ నిబంధనలు ఉల్లంఘించడంతో సీఎం రమేశ్‌ వాట్సాప్‌ అకౌంట్‌ను రద్దు చేసింది. వాట్సాప్‌ ఇతర వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులపై విచారణ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సదరు సంస్థ తెలిపింది. తన వాట్సాప్ అకౌంట్ పనిచేయడం లేదంటూ సీఎం రమేశ్‌ పంపిన లేఖకు స్పందించిన సంస్థ పై విధంగా వివరణ ఇచ్చుకుంది. అయితే ఇలా కీలకమైన ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే తనపై ఇలాంటి కుట్రలు చేస్తోందని సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు. పొరపాటున తప్పు జరిగి వుంటే.. ఇకపై అలాంటిది జరగకుండా చూసుకుంటానని తన ఖాతాను పునరుద్ధరించాలని ఆయన వాట్సాప్‌ను కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read