cm relief fund 15022018 1

50వేల మందికి ఇప్పటి వరకు చంద్రబాబు ఎలా సాయం చేసారో చూసారా... దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని రికార్డు ఇది.... ఇలాంటి రికార్డులు జాతీయ మీడియాకు కనిపించవు... చంద్రబాబుని జాతీయ స్థాయిలో జరుగుతున్న కుట్రలో భాగంగా, గత కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రచారం చూస్తున్నాం... అయితే, ఇప్పుడు మీరు చూడబోయేది చంద్రబాబులోని మరో కోణం.... ఎప్పుడూ అభివృద్ధి, టెక్నాలజీ అనే మూడ్ లో ఉన్న చంద్రబాబు, కష్టం అని వచ్చిన పేదవారిని ఎలా ఆదుకున్నారో చూడండి.. ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, సియం రిలీఫ్ ఫండ్ నుంచి, పెద్దగా నిధులు ఇచ్చే వారు కాదు... అప్పట్లో ఆయన వర్కింగ్ స్టైల్ వేరు.... కాని, ఇప్పటి చంద్రబాబు వర్కింగ్ స్టైల్ వేరు...

cm relief fund 150220182

కష్టం అని ఎవరు వచ్చినా, దాంట్లో నిజా నిజాలు తెలుసుకుని, ఎంత సహయమ కావాలి అంటే అంత చేస్తున్నారు... అంతే కాదు టీవీల్లో వచ్చే వార్తలు కూడా చూసి, వారికి సహాయం చేస్తున్నారు.... కొన్ని నెలల క్రితం లివర్‌ సమస్యతో బాధపడుతున్న జ్ఞానసాయి అనే అమ్మాయి మెర్సీ కిల్లింగ్‌కు అనుమతి ఇవ్వాలని వారి తల్లిదండ్రులు దరఖాస్తు చేస్తుకున్నారు. మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న సీఎం... వారిని పిలిచి రూ.23లక్షల సాయం అందించి చెన్నై ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. అంతటితో ఆగలేదు... ‘లివర్‌ మార్పిడి అయ్యాక కూడా ఆ అమ్మాయికి ఖర్చులుంటాయేమో! వైద్య పరీక్షలు, మందులకు అవసరం అవుతాయేమో! మరో 3 లక్షలు మంజూరు చేయండి’ అని ఆదేశించి, నిధులు విడుదల చేయించారు.

విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ... మానవీయ స్పందనలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. ఎవరైనా వైద్యానికి ఆర్థిక సాయం కోసం వచ్చినప్పుడు వారి పరిస్థితిని ఆరా తీసి, అవసరాన్ని బట్టి ఎంత మొత్తం అన్నది రాస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లలో సుమారు 50వేల మందికి సీఎం సహాయనిధి నుంచి ఆర్థికసాయం అందించారు. వైద్య అవసరాలను బట్టి రూ.20వేల నుంచి రూ.20లక్షల పైవరకు సాయం మంజూరు చేశారు. ఇప్పటికి రూ.370కోట్లను అందించారు. గత ప్రభుత్వ హయాంలో 2009నుంచి 2012వరకు నాలుగేళ్లలో సుమారు 26వేల మందికి సీఎం సహాయ నిధి నుంచి రూ.127కోట్లు సహాయం అందింది. అదికూడా... సమైక్యాంధ్రలోని 23 జిల్లాలకు కలిపి. కానీ, ఈ మూడేళ్లలో 13జిల్లాల ఏపీకే 50వేల మందికి రూ.370కోట్ల సాయం చేశారు. గతంతో పోలిస్తే ఇది ఐదారు రెట్ల కంటే ఎక్కువ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

cm relief fund 15022018 3

గతంలో సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం కావాలంటే ప్రజాప్రతినిధుల సిఫారసు తప్పనసరి. చంద్రబాబు ఈ విషయంలోనూ సంస్కరణలకు తెరతీశారు. ప్రజాప్రతినిధుల లేఖలు లేకున్నా, చివరకు తాను సంతకం చేయకున్నా సాయం అందేలా ఏర్పాట్లు చేశారు. వెలగపూడిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కింది అంతస్థులో సీఎం సహాయనిధి విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఏ రోజైనా ఇక్కడకు వచ్చి సామాన్యులు తమ దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు. తమ బాధలు చెప్పుకోవచ్చు. వాటిని ఆన్‌లైన్‌లోనే ఆమోదించి ఆర్థికసాయం మంజూరు చేస్తున్నారు. తెల్లరేషన్‌కార్డు ఉన్నవారు ఎలాగూ ఎన్టీఆర్‌ వైద్యసేవ పరిధిలోకి వస్తారు. ఆ పథకం కింద కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. అయితే తెల్లరేషన్‌కార్డులు లేనివారు, ఒకవేళ ఆ రేషన్‌కార్డు ఉన్నా ఎన్టీఆర్‌ వైద్యసేవ పరిధిలోకి రాని జబ్బులకు సీఎం సహాయ నిధికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తెల్లరేషన్‌కార్డు లేకున్నా పేదలమే అని చెప్పేందుకు ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం. ఇందులోను కొంత ఉదారంగానే సీఎం వ్యవహరిస్తున్నారు. వైద్య ఖర్చు అనేది కుటుంబాల ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేస్తుందని, అలాంటి సమయంలో ఆదుకోవడం ప్రభుత్వ కర్తవ్యమని అధికారులకు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read