మానవత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తత్వం...ప్రజలకు ఏ కష్టమొచ్చినా, వాళ్ళ బాధను తన బాధగా భావించి తన దృష్టికి వచ్చినంతనే క్షణాల్లో తీరుస్తూ సాంత్వన కలిగించడానికి గ్రామ దర్శిని, గ్రామ వికాసం ఎంతో ఉపయుక్తం అవుతున్నయనడానికి ఇవే ఉదాహరణలు...పసి బిడ్డల నుంచి పండు టాకులలాంటి వృద్ధులకు చేరువగా ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటూ...మంచి పంచుతూ పెద్దకొడుకుగా ఆదుకుంటూ ఆత్మీయ ఆశీర్వాదం పొందుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన శాంతికి, సహనానికి, సానుకూలతకు, ఆదర్శానికి వేదికగా మారింది.
గ్రామదర్శినిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయం ప్రకటిస్తే సీఎంఆర్ ఎఫ్ విభాగ ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శి రామసుబ్బయ్య రియల్ టైమ్ గవర్నెన్స్ సాయంతో సాయంత్రానికే ఆ సహాయం చెక్కును రోగికి పంపించడం విశేషం. గ్రామదర్శిని లో భాగంగా కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్లలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిని గౌరంపాలేనికి చెందిన కోలేటి జ్యోతి అనే మహిళ కలసి తన అనారోగ్య సమస్యను విన్నవించింది. పెద్దమనసుతో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటికప్పుడే రూ.50, 000 సహాయం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో రియల్ టైమ్ గవర్నెన్స్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శి రామసుబ్బయ్య నేతృత్వంలో సీఎంఆర్ ఎఫ్ కార్యాలయం తక్షణం ఆయన ఆదేశాలను అమలు చేసింది. ఆస్పత్రి ఖర్చులకోసం ఇచ్న రూ.50 వేలకు చెక్ (నెం: 080025)ను జారీ చేసింది. ‘మీకు కష్టం వచ్చినప్పుడు మీ కుటుంబాన్ని పెద్దకొడుకుగా ఆదుకుంటానని మాటిచ్చాను. అన్నమాట నిలుపుకొంటూ ఆస్పత్రి ఖర్చుల కోసం కొలేటి జ్య్తోతికి రూ.50 వేల చెక్ ఇస్తున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు రోగి కోలేటి జ్యోతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.