"Right now news has come that BS Yeddyurappa has resigned as Karnataka's CM, are all of you happy? All those who believe in democracy are happy" ఇది చంద్రబాబు విలేఖరులకు చెప్పిన సమాధనం... అనంతరం, యడ్యూరప్ప రాజీనామా అంశాన్ని సాధికార మిత్ర సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించారు. యడ్డీ రాజీనామా చేయడం అందరికీ సంతోషంగా ఉందా అంటూ సాధికార మిత్ర కార్యకర్తలను చంద్రబాబు ప్రశ్నించారు. సంతోషంగా ఉందంటూ సాధికార మిత్ర కార్యకర్తలు బదులిచ్చారు. యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయం అని చంద్రబాబు అన్నారు. యడ్యూరప్ప రాజీనామా చేయడం అందరికీ సంతోషమే అని అన్నారు. " రాష్ట్రానికో విధానం అన్నట్టుగా వ్యవహరిస్తోంది బీజేపీ. గోవాలో ఓ తరహాలో.. కర్ణాటకలో మరో తరహాలో వ్యవహరిస్తోంది బీజేపీ. ప్రధాని, బీజేపీ అధినేత లాంటి వారు రంగంలోకి దిగారు.. కానీ విఫలం చెందారు" అని చంద్రబాబు అన్నారు.
"ఏపీకి అన్యాయం చేసిన వారిని మట్టి కరిపించాలని పిలుపిచ్చా. గాలి జనార్దన్ రెడ్డి లాంటి అవినీతి పరులను బీజేపీ రంగంలోకి దింపింది. గాలి అంటేనే మనకు భయం. వంద కోట్లు ఇస్తాం. లైఫ్ సెటిల్ చేస్తామంటూ గాలి ప్రలోభ పెట్టారు. ప్రధాని లాంటి నేతలు.. జాతీయ నేతల్లాంటి వారు అవినీతిని ప్రొత్సహిస్తే యువతకేం సందేమిస్తారు..? యడ్డీ రాజీనామా చేశారనగానే మహిళల ముఖాలు వెలిగిపోయాయి. కర్ణాటకలో ఏం జరుగుతుందోననే ఆందోళన అందరిలోనూ కనిపించింది. ప్రజాస్వామ్యం విజయం సాధించిన రోజు. " అని చంద్రబాబు అన్నారు.
"కర్నాటక అయిపోయింటే ఆ తర్వాత మనపై పడేవారు. తమిళనాడులోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రజాస్వామ్యవాదిగా కర్ణాటక ఎపిసోడు పై స్పందిస్తున్నా. నా పుట్టిన రోజు నాడే దీక్ష చేసే పరిస్థితికి తెచ్చారు. ఏపీకి న్యాయం చేయమంటే ఏ మాత్రం పట్టించుకోలేదు. గవర్నర్ మెజార్టీ ఉన్న వాళ్లని పిలవకుండా యడ్జీతో ప్రమాణ స్వీకారం చేయించారు. కర్నాటకలో బీజేపీ నేతలు ఓటుకు పది వేలిచ్చారనే ప్రచారం ఉంది. అవినీతి పరుల భరతం పట్టండని పిలుపిచ్చా. కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలకు వంద కోట్ల రూపాయలు.. మంత్రి పదవుల విషయంలో వల వేసిన సంఘటనలు ప్రపంచం చూసింది. ప్రొటెం స్పీకరుగా సీనియర్ ఎమ్మెల్యేను నియమించడం ఆనవాయితీ.. కానీ దీన్ని కర్ణాటకలో బీజేపీ ఉల్లంఘించింది. కర్ణాటక అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేయమని సుప్రీం ఆదేశించడం మంచిదైంది." అని చంద్రబాబు అన్నారు...