పులివెందుల అంటే గుర్తు వచ్చేది వైఎస్ ఫ్యామిలీ.... కాని వారు ఇప్పటి వరకు పులివెందులకు ఏమి చేసారు అంటే ? అక్కడి ప్రజలే చెప్తారు... పులివెందుల అంటే ఫ్యాక్షనిస్టులు అనే విధంగా తయారు చేసింది వైఎస్ ఫ్యామిలీ... కాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి పులివెందుల పై ప్రత్యెక శ్రద్ధ చూపించారు... కత్తులతో కాదు, అభివృద్ధితో వశం చేసుకుంటా... నీళ్ళు ఇచ్చి వారి మనసులు కొల్లగొడతా అంటూ చెప్పి మరీ, పులివెందులకు నీళ్ళు ఇచ్చి, ఇప్పుడు స్వయంగా అక్కడకు వెళ్లనున్నారు చంద్రబాబ... వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో రేపు చంద్రబాబు అడుగు పెడుతున్నారు...
జన్మభూమి కార్యక్రమంలో పాల్గునటానికి చంద్రబాబు రేపు పులివెందుల వెళ్తున్నారు... పార్నపల్లె వద్దనున్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు సీఎం చంద్రబాబునాయుడు ముందుగా రానున్నారు. ఉదయం చిత్రావతి వద్దకు హెలికాప్టర్ ద్వారా వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన, శిలాఫలకం అవిష్కరించి, అనంతరం పీబీసీ కాలువకు నీటిని విడుదల చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ, ఎంపీ సీఎం రమేష్ ఇన్చార్షి మంత్రులు కూడా వస్తారు.
పులివెందుల ధ్యాన్ చెంద్ క్రీడా మైదానంలో ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గుంటారు.. సుమారు 50 వేల మంది ప్రజలు వస్తారు అని అంచనా వేస్తున్నారు. జగన్ సొంత నియోజకవర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి, అక్కడి ప్రజలకు మరిన్ని ప్రాజెక్ట్ లకు హామీ ఇవ్వనున్నారు.. పులివెందులకు భారీవరాలు ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి... పులివెందులకు వైఎస్ కుటుంబం, జగన్ ఏమి చేసారు, ఈ మూడున్నర ఏళ్ళల్లో ఏమి చేసాం అనేది చంద్రబాబు పూర్తి వివరాలతో ప్రజలకు చెప్పనున్నారు... ఈ విషయం తెలిసిన జగన్ అలెర్ట్ అయ్యారు... చంద్రబాబు మీటింగ్ కంటే ముందే, ఎదురు దాడి చెయ్యాలి అని పార్టీ ప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చారు... రేపు చంద్రబాబు మీటింగ్ లో ఏమి మాట్లాడుతారా అనే ఆశక్తితో పులివెందుల ప్రజలు ఎదురు చూస్తున్నారు...