వారానికి ఒక ఆరోపణ తీసుకువచ్చి, చంద్రబాబు అవినీతి చేసారు అంటూ గాల్లో కబురులు చెప్పి, అదిగో చంద్రబాబు అరెస్ట్, ఇదిగో చంద్రబాబు అరెస్ట్ అంటూ, చివరకి ఎప్పుడో 8 ఏళ్ళ క్రిందట ప్రజా ఆందోళన పై చేసిన ఒక పిల్ల కేసు తీసుకుని నోటీసులు ఇచ్చి, అరెస్ట్ వారంట్ ఇచ్చారు. అంటే, చంద్రబాబు అవినీతి పై వీళ్ళకు ఆధారాలు ఏమి దొరక్క, వీళ్ళ ఇగో చల్లార్చుకోవటానికి, ఇలా నోటీస్ పంపించారు. ఇప్పుడు చంద్రబాబు ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించబోతున్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రంసంగించాల్సిందిగా సీఎంను యూఎన్ఓ ఆహ్వానం పంపింది.
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అనుసురిస్తున్న విధానాలను యూఎన్ఓ ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు నిలిచిపోనుంది. ఇవన్నీ తట్టుకోలేని ఢిల్లీ పెద్దలు, రగిలిపోతున్నారు. అందుకే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లాంటి వాడు ఉన్నట్టు ఉండి హడావిడిగా విజయవాడ వచ్చారు. చంద్రబాబు అమెరికా వెళ్లి గంటల ముందు, ప్రజల్లో ఆలోచన రేపటానికి, చొవ్కబారు ఆరోపణలతో ముందుకువచ్చారు. ఐక్యరాజ్యసమితిలో ఏ మీటింగ్‌కు సీఎం వెళ్తున్నారో.. వారి పంపిన ఇన్విటేషన్ ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు పెడుతున్న సమావేశాలకు వెళ్తూ.. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్తున్నట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐక్యరాజ్యసమితిలో ఏ మీటింగ్‌కు సీఎం వెళ్తున్నారో.. వారి పంపిన ఇన్విటేషన్ ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే జీవీఎల్ ఈ ఆరోపణలు చేసిన అరగంటలోనే ఏపి సీయంఓ, కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి ఆహ్వానాన్ని ఏపీ సీఎంవో మీడియాకు విడుదల చేసింది. ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న తీరును ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ప్రకృతి వ్యవసాయంపై మాట్లాడేందుకు రావాలని చంద్రబాబును కోరిన ఐక్యరాజ్యసమితి. గత నెల 22న చంద్రబాబుకు ఆహ్వానం పంపిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సాల్హిమ్ పేరుతో సీఎంను పిలిచిన ఐక్యరాజ్యసమితి. చంద్రబాబు స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతారని ఐక్యరాజ్యసమితి లేఖలో పేర్కొంది.