ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సియంవో కార్యదర్శుల శాఖలను మార్చుతూ ప్రభుత్వం నిర్నయం తీసుకుంది. పలువురుని తొలగించి, మరి కొందరికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. అలాగే కొంత మంది కార్యదర్శుల శాఖలు మార్చారు. పరిపాలనలో అత్యంత ముఖ్యమైన సిఏంవోలో ఈ మార్పులు చోటు చేసుకోవటం వెనుక ఉన్న మతలబు ఏమిటో అర్ధం కావటం లేదు. ఇది రొటీన్ గా జరిగే ప్రాసెస్ కాదని, ఒకసారి సిఏంవోలో ఉంటే, ఎక్కువ కాలం ఉంచుతూ ఉంటారనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ప్రవీణ్ ప్రకాష్ కు మరింతగా వెయిట్ ఇచ్చారు. ఆయనకు ఇంచుమించు అన్ని కీలక శాఖలు అప్పచెప్పేసారు. హోం, రెవిన్యూ, జీఏడి, న్యాయ, ఆర్ధిక, ప్రణాళిక శాఖలతో పాటుగా, సియం దగ్గర ఉన్న ఇతర శాఖలు అయిన, పునర్విభజన చట్టం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంప్రదింపులు, ముఖ్యమంత్రి కార్యాలయ అవసరాలు అన్నీ, ఇక పై ప్రవీణ్ ప్రకాష్ చూసుకోనున్నారు.
ఇక మరో కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్ కు, రవాణా, రోడ్లు, హోసింగ్, పౌర సరఫరాలతో పాటు, పంచాయతీ రాజ్, విద్యా, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఐటి, మైన్స్ తో పాటుగా, కార్మిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలు ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డికి, జల వనరులు, వ్యవసాయం, పర్యావరణం, ఆరోగ్యం, విధ్యుత్, టురిజం, మార్కెటింగ్ శాఖల పర్యవేక్షణ బాధ్యతలు ఇచ్చారు. అయితే అజయ్ కల్లం, పీవీ రమేష్ లాంటి వారు ఈ బాధ్యతలు చూసుకుంటూ ఉండేవారు. అయితే ఉన్నట్టు ఉండి వారికి బాధ్యతలు ఎందుకు తొలగించారు, అన్ని శాఖలు కేవలం ఈ ముగ్గురికే ఎందుకు ఇచ్చారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రవీణ్ ప్రకాష్ కు ఆయవు పట్టు మొత్తం, ఆయన చేతిలోనే పెట్టినట్టు అయ్యింది.