క-రో-నా.. ఈ పేరు వింటేనే ప్రపంచం అంతా గజ గజ వణికిపోతుంది. రెండు సంవత్సరాల పాటు క-రో-నా విలయ తాండవాన్ని తట్టుకోలేక ఎంతో మంది ప్రాణాలను వదిలారు. ఇప్పుడుప్పుడే జనం క-రో-నా బారి నుంచి ఊపిరి పీల్చుకుంటురనుకుంటుంటే, మళ్ళీ ఇప్పుడు క- రో- నా విజ్రుంబించబోతుందని, కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు రాసిన లేఖతో జనం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. క-రో-నా తన పంజా విసరబోతుందని వార్తలొస్తున్న నేపద్యంలోఅన్ని రాష్ట్రాలకు క-రో-నా పై వస్తున్న వార్తలు నిజమేనంటూ, అందరూ అలర్ట్ గా ఉండాలని కేంద్రం సూచనలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, వారానికి 30 లక్షల పైనే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, కేంద్రం హెచ్చరించింది. ఇలా కేసులు ఉంటే భారత్లో కూడా తొందరగా ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్రం చెబుతుంది. అందుకని దేశంలోని ప్రతిఒక్కరు చాలా అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే రెండేళ్ల క్రితం నాటి దుర్బర పరిస్థితులు చూడాల్సి వస్తుందని కేంద్రం అన్నీ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. .
మళ్ళీ క-రో-నా విజ్రంభణ తప్పదా ? రాష్ట్రాలను అలెర్ట్ చేస్తూ కేంద్రం రాసిన లేఖలో ఏముంది ?
Advertisements