ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల కబ్జా ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో రాజంపేటలోని పోలి గ్రామంలో వైసీపీ నేత పోలి సుభారెడ్డి కొండను సైతం మింగేశారు. ఈ వైసీపీ నేతలు ఖాళీ స్థలాలను కబ్జా చేయడమే కాకుండా, కొండలను కూడా తవ్వేసి కబ్జా చేయడంతో, అక్కడ ఉన్న ప్రజలే కాకుండా, అధికారులు సైతం విస్మయానికి గురవుతున్నారు. రాజంపేట పోలి గ్రామంలో వైసీపీ నేతలు కొండను సైతం తవ్వేసి ఆక్రమించేసారు. అక్కడ స్థానిక వైసీపీ నేత పోలి సుభారెడ్డి ఈ కొండను తవ్వి ఏకంగా 100 ఎకరాలు కబ్జా చేయడంతో ,అక్కడ కలక్టర్ కూడా షాక్ తిన్నారు. కబ్జా చేసిన కొండను పరిశీలించిన కలెక్టర్ 100 ఎకరాల కొండను తవ్వేందుకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ అక్కడి ఆర్డీవోను ప్రశ్నించారు. అంతేకాకుండా తవ్విన గ్రావెల్ ఏమైందని కూడా కలెక్టర్ గిరీషా అధికారులను నిలదీయడంతో ఏం చెప్పాలో తోచక అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ కబ్జా భూమిలో పాతిపెట్టిన రాళ్లను తక్షణమే తీసివేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేసాలు జారీ చేసారు. దీనితో తప్పేది లేక వైసీపీ నేత సుభారెడ్డి కబ్జాపై ఉన్నతాధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇలా చూసుకుంటూ పోతే రాష్ట్రం లో ఎన్ని వందల , వేల కబ్జాలు బయటపడతాయో.
వైసీపీ నేత కబ్జా పై కలక్టర్ సీరియస్... ఏకంగా కొండని కొట్టేస్తే ఏమి చేస్తున్నారని అధికారుల పై ఫైర్...
Advertisements