ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సలహాదారులు ఎక్కువ ఉన్నారని, దాదాపుగా 33 సలహాదారులు వరకు ఉన్నారని, వీరిలో చాలా మందికి అన్ని అలౌవెన్స్ లు కలుపుకుని, దాదాపుగా నాలుగు లక్షల వరకు జీతాలు ఇస్తున్నారని, ఇంత ప్రజాధనం ఎందుకు వృధా అంటూ, అటు పత్రికకు, ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని విమర్శల మధ్య కూడా, పోయిన వారం మరో సలహదారుని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కమ్యూనికేషన్స్ సలహదారుగా ఉన్న, జీవీడీ కృష్ణమోహన్ జీతాన్ని భారీగా పెంచేసింది. ఆయనకు ఇప్పటి వరకు జీతం నెలకు, రూ.14 వేలు కాగా, ఆయన జీతాన్ని ఇప్పుడు రెండు లక్షలు చేసింది ప్రభుత్వం. అంటే ఒకేసారి లక్షా 86 వేల జీతం పెంచింది. దీనికి సంబంధించి నిన్న ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవోలో, జీతం పెంపుకు కారణం చెప్తూ, ఆయన పనితనానికి మెచ్చి, జీతం పెంచినట్టు ప్రభుత్వం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో జీవీడీ కృష్ణమోహన్ ను కమ్యూనికేషన్స్ సలహాదారుగా నియమించి, ఆయనకు క్యాబినెట్ ర్యాంకు కూడా ఇస్తూ, ప్రభుత్వం ఆదేశాలు జరీ చేసింది.
అప్పట్లో ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వటంతో, ఇతర మంత్రులతో పాటు ఆయనకు కూడా 14 వేల జీతం, హౌసింగ్ రెంట్ అలౌన్స్ కింద లక్ష రూపాయలు, కారు అద్దె కోసం 30 వేలు, ఇతర అలవెన్స్ లు ఇవ్చ్చే వారు. అయితే ఇప్పుడు జీతం 14 వేల నుంచి రెండు లక్షలు చేసారు. అలాగే ఇతర అలవెన్స్ లు అలాగే ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ప్రకారం, మంత్రులు హోదా ఉన్నవారి కంటే, ఎక్కువ జీతం ఇస్తున్నారు. జీవీడీ కృష్ణమోహన్ , సాక్షిలో పని చేసే వారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఆయన్ను ప్రభుత్వంలోకి తీసుకున్నారు. ఇప్పటికే సలహాదారు పదవులు, వాటి ఖర్చు పై చర్చ జరుగుతున్న సమయంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం సాహసం అనే చెప్పాలి. మరి ప్రతిపక్షాలు, ఇతర సామాజిక వేత్తలు దీని పై ఎలా స్పందిస్తారో చూడాలి..