అన్నీ తెలిసిన వాడు అమావాస్య రోజు చచ్చినట్టు, ఇంట చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ లు, చివరకు జనసేన లాంటి పార్టీల చేతిలో కూడా అవమానాలు పొందుతున్నారు... సిద్ధాంతాలు వదిలేసి, కమ్యునిజం సిగ్గు పడేలా, గత కొన్నేళ్ళ నుంచి కమ్యూనిస్ట్ లు దిగజారి పోతూ వచ్చారు... దానికి పరాకాష్ట, జనసేన లాంటి పార్టీలతో కలిసి ప్రయాణం... ప్రజా రాజ్యం పార్టీలో, నెంబర్ 2 అయిన పవన్ కళ్యాణ్ తో, ఎందుకు పొత్తు పెట్టుకున్నారో, అది ఏ సిద్ధాంతమో వారే చెప్పాలి... అయితే, వెళ్ళు చేసిన పనులకు మూల్యం చెల్లించుకుంటున్నారు... కెమెరాలు ముందు చొక్కాలు మోస్తే, ఆహా ఒహా అన్న వారు, ఇలాంటి వాటికి సమాధానం ఏమి చెప్తారో మరో.. అసలు ఈ రోజు ఏమి జరిగింది అంటే...
పవన్ కల్యాణ్ గురువారం వామపక్ష నేతలతో సమావేశం నిర్వహించేందుకు మీటింగ్ ఏర్పాటు చేసారు... అయితే ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు మరో ఇద్దరు నాయకులు మధ్యాహ్నం జనసేన కార్యాలయానికి వచ్చారు. కాగా... వీరిని కార్యాలయంలోకి వెళ్ళకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు... తమకు సమాచారం లేదని, లోనికి అనుమతించమంటూ నేతలను అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీలేక దాదాపు ఓ పావుగంట సేపు అలాగే గేటు బయట వామపక్ష నేతలు నిల్చుండిపోయారు.
ఇదిలా ఉండగా ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఖమ్మం జిల్లాకు చెందిన నేతలతో సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంత సేపటికి వారిని లోపాలకి పంపాల్సిందిగా సెక్యూరిటీకి ఆదేశాలు రావటంతో చివరకు గేట్లు తీశారు. ఆ తర్వాత వామపక్ష నేతలు లోనికి వెళ్లారు... ఇంత సేపు గేటు బయట పడిగపులు కాస్తూ కూర్చున్నారు... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వస్తే, ఆయన్ను లోపలకి పంపించాలన్న సంస్కారం అక్కడ ఒక్కడికి లేదు... అయినా సెక్యూరిటీ కి ఎవరు ఏంటో తెలియదా ? సెక్యూరిటీ ఆపితే, పార్టీ వర్గాలు ఏమి చేస్తున్నాయి ? పావు గంట సేపటి దాకా, గేటు ముందు నుంచున్నారు అంటే, కమ్యూనిస్ట్ లు ఎంత దిగాజారి పోయారో అర్ధమవుతుంది... ఎవడి కర్మకు ఎవరు బాధ్యులు చెప్పండి...