మన రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు తమ అస్తిత్వం కోసం, సినీ గ్లామర్ వైపు పరుగులు పెడుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో కలిస్తే, సీట్లు ఎక్కవ రావని, పవన్ తో వెళ్తే, సీట్లు ఎక్కువ ఇస్తారని, ఒకటో రెండో గెలవచ్చని, పవన్ గ్లామోర్ ఉపయోగించుకుని, మళ్ళీ ఏపిలో బలం తెచ్చుకోవాలని, ఏవేవో కలలు కంటున్నారు, లోకల్ కమ్యూనిస్ట్ లు. కాని జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ నాయకత్వం, చంద్రబాబు వైపు మొగ్గు చూపుతుంది. కమ్యూనిస్ట్ అగ్ర నాయకులు, ఎప్పుడూ చంద్రబాబుకు అనుకూలంగానే ఉంటారు. ప్రస్తుత నేపధ్యంలో, మోడీని గద్దె దించటానికి, విపక్షాలు అన్నీ ఏకం అవుతున్నాయి. ఇందుకోసం, విపక్షాలు టం ఐక్యతను చాటటానికి ఏ అవకాశం వదులుకోవటం లేదు.

communist 07082018 2

తాజాగా నిన్న జరిగిన, పీఏసీ సభ్యుల నియామకంలో కూడా, పార్లమెంటులో విపక్షాలు మరోసారి ఐక్యతను ప్రదర్శించి విజయం సాధించాయి. ఇక్క ఆంధ్రాలో కమ్యూనిస్ట్ లు చంద్రబాబుని తిడుతుంటే, దేశ స్థాయిలో, కమ్యూనిస్ట్ పార్టీలు, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి మరీ, తెలుగుదేశం అభ్యర్ధిని గెలిపించారు. ఈ పరిణామంతో పవన్ కళ్యాణ్ కు ఒక షాక్ ఇచ్చినట్టు అయ్యింది. కమ్యూనిస్ట్ లు తనతో ఉన్నారని, కలిసి ఉద్యమాలు చేస్తామని అని చెప్తున్న పవన్ కు, జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం, కనీసం పవన్ అనే వాడిని గుర్తించలేక పోవటం, చంద్రబాబుకు అధిక ప్రాధాన్యత ఇవ్వటంతో, పవన్ కు రుచించటం లేదు.

communist 07082018 4

పీఏసీ సభ్యుల నియమాకానికి జరిగిన ఎన్నికలో విపక్షం తరఫున టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ విజయం సాధించారు. దీంతో రాజ్యసభలో ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంలో టీడీపీ మరోసారి విజయవంతమైంది. జ్యసభలో టీడీపీకి ఆరుగురు సభ్యులు ఉండగా సీఎం రమేశ్‌కు 110 ఓట్లు దక్కాయి. కేవలం ఆరుగురు ఎంపీలున్న టీడీపీ నుంచి పీఏసీ సభ్యుడు ఎన్నికవుతారని ఎవరూ భావించలేదు. పీఏసీలో రెండు స్థానాలకు గానూ టీడీపీ తరఫున సీఎం రమేశ్‌, బీజేపీ తరఫున భూపేంద్ర యాదవ్‌, జేడీయూ నుంచి హరివంశ్‌లు పోటీపడ్డారు. మొత్తం ఓట్లలో సీఎం రమేశ్‌కు 110 ఓట్లురాగా భూపేంద్రయాదవ్‌కు 69, హరివంశ్‌కు 26 ఓట్లు పోలయ్యాయి.

communist 07082018 3

రాజ్యసభలో ఎన్డీయేకు 89 మంది సభ్యులుండగా దీంట్లో ఒక్క బీజేపీ పార్టీ సభ్యులే 73 మంది. యూపీఏకు చెందిన 57 మందిలో 50 మంది కాంగ్రెస్ ఎంపీలే. ఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌లకు చెరో 13 మంది, బీఎస్పీ, ఎన్సీపీలకు నలుగురు చొప్పున, ఆప్ ముగ్గురు, సీపీఎంకు ఐదుగురు సభ్యులు ఉన్నారు. పీఏసీలో 15 మందిని లోక్‌సభ నుంచి, ఏడుగురిని రాజ్యసభ నుంచి మొత్తం 22 మందిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం పీఏసీ ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జునఖర్గే కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం పీఏసీ ఛైర్మన్ పదవి విపక్షానికి కేటాయిస్తారు.

communist 07082018 5

సీఎం రమేశ్ ఎన్నికపై టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ట్వీట్ చేస్తూ.. ‘టీడీపీ సభ్యుడు సీఎం రమేశ్‌ ఎన్నిక ద్వారా ప్రతిపక్షాల ఐక్యత మరోసారి రుజువైంది.. బీజేపీ/ ఎన్డీఏ అభ్యర్థి చాలా దూరంలో నిలిచిపోయాడు.. తమ ఐక్యతతో టీడీపీ ఎంపీ రమేశ్‌కు 110 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 69 ఓట్లు, ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ అభ్యర్థికి 26 ఓట్లు వచ్చాయి’ అని అన్నారు. పీఏసీ సభ్యుడిగా ఏడాది పాటు సీఎం రమేశ్ కొనసాగనున్నారు. ఇలా ఆయన ఎన్నిక కావడం ఇది రెండోసారి. ప్రస్తుతం ఉన్న రెండు ఖాళీల్లో విపక్షాల నుంచి ఒకరు, అధికార పార్టీ నుంచి ఒకర్ని నియమించాలని చేసిన ప్రతిపాదనను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తిరస్కరించి ఎన్నికకు పట్టుబట్టారు.. దీంతో ఫలితం ఇలా వచ్చిందని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read