ఆంధ్రప్రదేశ్ - ది సన్-రైజ్ స్టేట్ ... ఇది ఎదో కొటేషన్ కాదు, ఇది వాస్తవం... ఆంధ్రవాడిని అడ్డుకునే శక్తి ఎవ్వడికి లేదు... ఎన్నో అవమానాలు, సొంత రాష్ట్రంలో, ఒక వర్గం నిట్టూర్పులు... పరాయి రాష్ట్రంలో ఉంటూ, సొంత రాష్ట్రం మీద కుట్ర చేసే సంత..... అన్నిటికీ మించి ఢిల్లీ కుట్రలు... అసలు ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వగలమా అనే పరిస్థితి... భవిషత్తు శూన్యం... ఏమి జరుగుతుందో తెలీదు, ఎప్పటికి కోలుకుంటామో తెలీదు, మన పిల్లల భవిష్యత్తు ఏమి అవుతుందో అనే ఆందోళన... అలాంటి పరిస్థితిల్లో నుంచి, కారు మబ్బులుని చీల్చుకుంటూ, ఉదయిస్తుంది, మన ఆంధ్రప్రదేశ్... ఇది వాస్తవం, అని ఎన్నో ప్రపంచ స్థాయి సంస్థలు చెప్పాయి, కేంద్రం విడుదల చేస్తున్న ర్యాంకింగ్స్ చెప్తున్నాయి... మన రాష్ట్ర వృద్ది రేటు చెప్తుంది... స్వయంప్రకటిత మేధావులు, రాజకీయ అవకాశవాదులు, కుల గజ్జి మేధావులు, వ్యక్తిగత, స్వార్ధ ప్రయోజనాల కోసం వెంపర్లాడే మీడియా జనాలు, పరాయి రాష్ట్రంలో ఉంటూ, సొంత రాష్ట్రం మీద కుట్ర చేసే సంత ఇలా ఎవరైనా సరే, ఇంత స్పష్టంగా వాస్తవాలు కనిపిస్తున్నా, చూడలేని , అంగీకరించలేని వాళ్లు ఉంటే, వెళ్లి కోడి గుడ్డు మీద ఈకలు పీక్కోవచ్చు...

companies 21032018 2

ఇవిగోండి 2014 నుంచి ఇప్పటి వరకు, 2016 CII సమ్మిట్ లో, 2017 CII సమ్మిట్, , 2018 CII సమ్మిట్ లో పనులు ప్రారంభించిన, గ్రౌండ్ అయిన కంపెనీల వివరాలు.... చంద్రబాబు తెచ్చిన పెట్టుబడులు, ప్రశ్నించే వారందరికీ ఇందులో చాలా సమాధానాలు లభిస్తాయి. ఇందులో ఎన్ని ఒప్పందాలు జరిగాయి, ఎంత విలువ, వాటిలో ఎన్ని వాస్తవ రూపం దాల్చాయి, ఎంత మందికి ఉపాధి అవకాశాలు లభించాయి అనే వివరాలు స్పష్టంగా ఉన్నాయి... 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంపెనీల వివరాలు... (ఇవి మొబైల్ లో అంత స్పష్టంగా కనిపించవు... కంప్యూటర్ లో ఓపెన్ చేస్తే పూర్తిగా చూడవచ్చు) Source: https://www.apindustries.gov.in/Investment_AP/IndustryCount.aspx?Grid=Industry&LOS=All .... 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడుల వివరాలు... (కోట్లలో).... Source: https://www.apindustries.gov.in/Investment_AP/IndustryCount.aspx?Grid=Investment&LOS=All ..... 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఉద్యాగాల వివరాలు... Source: https://www.apindustries.gov.in/Investment_AP/IndustryCount.aspx?Grid=Employment&LOS=All ...

companies 21032018 3

ఈ లిస్టు ఏముందిలే ఎవడైనా ఇస్తాడులే అంటారా ? మామూలు మనుషులకి అయితే, పైన చెప్పింది సరిపోతుంది... మన రాష్ట్రంలో ఒక వింత బ్రీడ్ ఉంది కదా వారి కోసం, మరిన్ని వివరాలు పెట్టాడు చంద్రబాబు... పైన లింకులకి వెళ్ళండి.. అక్కడ G1 అని ఉంటుంది... అంటే, అవి కంపెనీలు మొదలు పెట్టినవి... ఇవి 533 కంపెనీలు... ఇప్పటికే 2.70 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి... ఆ నంబర్స్ మీద క్లిక్ చెయ్యండి... మీకు కంపెనీల లిస్టు కనిపిస్తుంది... ఇక్కడ ప్రతి కంపెనీకి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి... అంతే కాదు, ఆ కంపనీలలో ఉద్యోగాలు వచ్చిన వివరాలు, వారి పేరు, ఫోన్ నెంబర్, ESI నెంబర్, ఇలా అన్నీ excel షీట్ లో ఉన్నాయి (2.70 లక్షల మందికి గాను, ఇప్పటికే 60 వేల మంది సమాచారం అప్డేట్ చేసారు... ప్రతి రోజు ఈ లిస్టు అప్డేట్ అవుతుంది.. మరో నెలలో 2.70 లక్షల మంది సమాచారం అప్డేట్ అవుతుంది)... ఉదాహరణకు ఒక కంపెనీ ద్వారా, 2 వేల ఉద్యోగాలు వస్తే, 2 వేల మంది వివరాలు ఉన్నాయి... ఆ కంపెనీ HR ఫోన్, ఈ మెయిల్ id కూడా ఉంది... కావాలంటే ఫోన్ చేసి కనుక్కోవచ్చు.... ఇంత చెప్పినా నమ్మక పొతే, ఆ కంపెనీ అడ్రస్ కూడా ఉంది, ఒక కార్ కాని, బస్సు కాని వేసుకుని వెళ్లి చూసి వచ్చి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి... ఇక ఇంత కంటే transparetగా ప్రపంచంలో, ఏ ప్రభుత్వం పని చెయ్యదు.... ఊరికే చంద్రబాబు మీద పడి ఏడవకుండా, మన రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి గర్వంగా ఫీల్ అవ్వండి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read