తెలుగు రాష్ట్రాల రాజకీయ స్థితిగతుల్ని దగ్గర నుండి గమనిస్తే చాలా వింతగా కనిపిస్తుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకే రకమైన సమస్య, కానీ వేరు వేరు పరిస్థితుల్లో కనిపిస్తుంటాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సిపి ఎంతసేపు, ఎంత తొందరగా అధికార పీఠం ఎక్కుదామని యావ తప్ప ప్రజా సమస్యలు పట్టవు. అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చించాల్సి ఉందని, ఏదో ఒక సాకుతో అసెంబ్లీ సమావేశాలకు రారు. వచ్చిన ఏదో ఒక చిన్న విషయం చూపించి గోల గోల చేసి అసెంబ్లీని వాయిదా పడేట్టు చేస్తారు. గత నవంబరు నుంచి అయితే వారి అధినేత పాదయాత్ర చేస్తున్నాడని, అధినేత లేకుండా అసెంబ్లీలో మాట్లాడితే ఎవరికి ఏమి మూడుతదో అని అధినేతతో సహా అందరూ అసెంబ్లీని బహిష్కరించారు. అసెంబ్లీకి రావడం ప్రజాసమస్యలు చర్చించటం వీరికి బహు బహు బద్ధకం.
ఇక తెలంగాణకు వస్తే వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రం. నోరులేని ప్రతిపక్షాలు. చేతి నిండా డబ్బు, అధికారం, పరపతి, ఇవి అన్ని ఉన్న టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ పాలన. ముఖ్యమంత్రి అవ్వాలని దశాబ్దాలపాటు కలలుగన్న ఈయన, ముఖ్యమంత్రి అయ్యాక, పాలించ లేక నాలుగేళ్ళకే మల్ల ఎన్నికలు అని బయలుదేరాడు. అధికారం ఉన్న పరిపాలించడానికి ఈయనకు బద్ధకం. ఈ నాలుగేళ్లు సచివాలయం కంటే ఫామ్ హౌస్ పదిలం అనుకున్నాడు. ప్రజలు ఇచ్చిన అధికారం తో పాలించడానికి ఈయనకు బద్ధకం.
ఇక మూడు ఆయన ఉన్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈయన అధికారంలో ఉంటే యంత్రం లాగా పని చేస్తాడు. అడిగిన అడగకపోయినా, ఈయన పొద్దున నాలుగు గంటల నుంచి అర్థ రాత్రి 12 వరకు పని పని పని అంటూ పని మీదే తిరుగుతుంటాడు. ప్రజలు.. ప్రజలు.. వాళ్లకు ఏంకావాలో చూస్తూ, చేస్తూ ఉంటాడు. ఈయన కసలు విసుగు విరామం ఉండవా అని ఆంధ్ర ప్రజలు ముద్దుగా విసుక్కుంటారు. ఇప్పుడు రాజకీయాలు పక్కనపెట్టి మామూలుగా మనుషులుగా ఆలోచిస్తే మనం ఈ ముగ్గురిలో ఎవరికి ఓటు వేయాలి ?