ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పై, వైసిపీ పార్టీ నేతలు కాని, ప్రభుత్వంలో ఉన్న వారు కాని, ఏదో ఒక విధంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న స్పీకర్ తమ్మినేని కూడా, కోర్టులే పాలించుకోండి, ఇక మేము ఎందుకు అనే విధంగా, మాట్లాడారు అంటే, మనం ఎక్కడకి వెళ్తున్నామో అర్ధం అవుతుంది. అయితే కోర్టులు మాత్రం, తీర్పులు ఇచ్చింది వైసీపీ రంగుల విషయంలో, చట్టం అతిక్రమించి మాతృభాష బోధన తీసివేయటం, అలాగే జగన్ అడిగిన వైఎస్ వివేక హత్య కేసు సిబిఐకి ఇవ్వటం, పోలీసులు మీదే ఆరోపణలు వస్తే డాక్టర్ సుధాకర్ దాడి సిబిఐకి ఇవ్వటం లాంటి తీర్పులు ఇచ్చారు. చట్టం దాటి ప్రవరిస్తే, కోర్టులు కలుగచేసుకోవటం, మనం చూస్తూనే ఉంటాం. అయితే, కొంత మంది మాత్రం, తీర్పులు ఇచ్చిన జడ్జిల పై, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. ఇలా అనేక రూపాల్లో జడ్జీల పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా, ఏకంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ టార్గెట్ గా, చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బీసీ సంఘం నేత హన్స్ రాజ్ పేరుతో, రాష్ట్రపతికి ఒక ఫిర్యాదు వెళ్ళింది.

ఈ ఫిర్యాదులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరీ, వైఖరి వల్లే, హైకోర్టులో కరోనా పెరిగిపోయింది అని, పేర్కొన్నారు. అలాగే చీఫ్ జస్టిస్ వైఖరితోనే, రిజిస్టార్ రాజశేఖర్ గుండె నొప్పి వచ్చి చనిపోయారని, చీఫ్ జస్టిస్ తీవ్ర ఒత్తిడి పెట్టారని, తరుచూ ఆయన చెప్తూ ఉండేవారని, ఇప్పుడు ఆయన చనిపోవటానికి కారణం, చీఫ్ జస్టిస్ అంటూ ఆ ఫిర్యాదులో తెలిపారు. ఇక మే నెలలో, జడ్జీల ప్రమాణస్వీకారం కూడా, ఒక చిన్న హాల్ లో చేసారని, కరోనా వ్యాప్తికి కారణం అయ్యారు అంటూ ఫిర్యాదులో తెలిపారు. హైకోర్టులో ఇప్పుడు కరోనా ఎక్కువ అయ్యి, కోర్టులు మూసేసే పరిస్థితి వచ్చిందని, దీనికి కారణం చీఫ్ జస్టిస్ అంటూ ఆ ఫిర్యాదులో చెప్పారు. ఈ ఫిర్యాదు రాష్ట్రపతితో పాటుగా, సుప్రీం కోర్టు జడ్జిలకు కూడా చేసారు. అయితే ఎక్కడో ఢిల్లీలో ఉండే ఈ హన్స్ రాజ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయాల పై, అదీ హైకోర్టు చీఫ్ జస్టిస్ పై ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో అర్ధం కావటం లేదు. ఈయన వెనుక ఎవరు ఉన్నారు అనే విషయం పై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read