విశాఖపట్నంలోని, అరకులోయ నియోజికవర్గంలో కొత్త వివాదం రాజేసుకుంది. అరకులోయ నియోజికవర్గంలో చేపడుతున్న, పనులు విషయంలో, స్థానిక ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, వాటాలు అడుగుతున్నారు అంటూ ఒక అధికారి ఏకంగా ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాయటం సంచలనంగా మారింది. నియోజకవర్గం పరిధిలో చేస్తున్న పంచాయతీరాజ్ శాఖలోని ఇంజినీరింగు పనులకు సంబధించి జరుగుతున్న పనుల్లో, వాటాలు వసూలు చేసి ఇవ్వాలి అంటూ, ఎమ్మెల్యే చెప్పారంటూ, పీఆర్ జేఈ సమరెడ్డి మాణిక్యం, జగన్ కు రాసిన లేఖలో వివారించారు. ఈ లేఖను, జగన్ మోహన్ రెడ్డితో పాటుగా, ఆ డిపార్టుమెంటు లోని, ఆయా శాఖల అధికారులకు పంపి, ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేస్తినట్టు, జేఈ చెప్పారు. ఈ లేఖను ఆయన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చెయ్యటం సంచలంగా మారింది. అరకులోయ నియోజికవర్గంలో ఉన్న, అనంతగిరి మండల జేఈగా, అలాగే అరకులోయ, డుంబ్రిగుడ మండలాలకు సంబంధించి కూడా ఇన్‌ఛార్జి జేఈగా మాణిక్యం, బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆయన లేఖలో తెలిపిన వివరాలు ప్రకారం, ఈ మూడు మండలాల పరిధిలో జరుగుతున్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పనుల్లో, తనకు మూడు నుంది అయుదు శాతం వాటా ఇవ్వాలని, ఆ డబ్బులు మీరే మాట్లాడి వసూలు చెయ్యాలంటూ, స్థానిక ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఒత్తిడి తెస్తున్నారని లేఖలో రాసారు. నేను అలాంటి పనులు చెయ్యలేనని, ఇలాంటివి నాకు చెప్పవద్దు అని చెప్పటంతో, తనను ఇక్కడ నుంచి బదిలీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా, ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నారని, ఆ లేఖలో తెలిపారు. అలాగే తన పై తప్పుడు నివేదిక ఇవ్వాల్సిందిగా కొంత మంది అధికారులను వేధిస్తున్నారని ముఖ్యమంత్రికి లేఖలో తెలిపారు. దీని పై స్పందించిన ఎమ్మెల్యే, ఆ ఆరోపణలను ఖండించారు. గత 5 ఏళ్ళలో జరిగిన పనులు పై, ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరపాలని లేఖ రాశామని, అలాగే జరిగిన పనుల్లో నాణ్యత లేకపోవటం, జాప్యం అవ్వటం పై, వివరణ కోరటంతోనే, జేఈ తన పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.