ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ కూర్పు పై సమీకరణలు మారుతూ ఉన్నాయి. నిన్నటివరకు కేవలం ముగ్గురు లేదా నలుగురిని మాత్రమే కొనసాగిస్తారు అని ప్రచారం జరిగినప్పటికీ కూడా, సీనియర్లు అదే విధంగా మరికొంత మంది మంత్రుల అలకల నేపధ్యంలో, జగన్ కు మంత్రి వర్గ కూర్పు తలనొప్పిగా మారింది. ప్రధానంగా సీనియర్లు అయిన పెదిరెడ్డి , బొత్సా లను కొనసాగించి, మిగతా అందరి మంత్రులను మార్చేస్తారని వైసిపి వర్గాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇందులో బాగంగానే జగన్ బందువైన , ఒంగోలు MLA బాలినేని శ్రీనివాస రెడ్డి గతంలో జగన్ ను కలిసినప్పుడు అందరినీ తీసేస్తున్నామని చెప్పటంతో , శ్రీనివాస రెడ్డి సాటిస్ ఫై అయ్యారు. అయితే ఆ తరువాత శ్రీనివాస రెడ్డి ని తొలగించి అదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ ను మాత్రం అలాగే ఉంచుతాం అని వార్తలు ఉండటంతో, ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్త పరచటమే కాకుండా హైదరాబాద్ వెళ్లి అలకపాన్పు ఎక్కినట్టు తెలుస్తుంది. దీనితో మళ్ళీ సజ్జల జ్యోక్యం చేసుకొని ఆయన్ను పిలిపించి జగన్ తో భేటి ఏర్పాటు చేసారు. జగన్ ను కలిసిన తరువాత కూడా బాలినేని తన పట్టు వీడకుండా అదే మూడ్ లో ఉన్నారు. ఈ రోజు ఒంగోల్ లో మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ, ప్రారంబోత్సవాలు అన్నీ, ఈ రోజు పెట్టేయాలని అనుచరులకు చెప్పటంతో ,అక్కడకు వెళ్లి ఆయన ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. అయితే బాలినేని పట్టు వీడక పోవడంతో జగన్ కు ఇది తల నొప్పిగా మారింది.
అదే విదంగా ఇక సంవత్సరం క్రితమే ప్రమాణ స్వీకారం చేసిన చెన్నుబోయిన వేణుగోపాల కృష్ణ ,అప్పలరాజు వీరిద్దరిని కూడా కొనసాగిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ప్రత్యేకంగా వేణుగోపాల కృష్ణను మాత్రం కులసమీకరణ నేపధ్యంలో తప్పకుండా కొనసాగిస్తారని చెబుతూ ఉన్నారు. సీదిరి అప్పలరాజుకు బదులు, సతీష్ కు ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో, తానూ ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమే అవుతుందని తనను కొనసాగించాలని అప్పలరాజు కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ఇక కులసమీకరణ నేపధ్యంలో ఆదిమూలపు సురేష్, గుమ్మనూరి జయరాం వీరిద్దరిని కూడా కొనసాగిస్తారని కూడా చెబుతున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే, నిన్నటి వరకు కేవలం నలుగురు పాత మంత్రులు ఉంటారని ప్రచారం జరగగా, నిన్నటి నుంచి మారిన పరిస్థితులు, సీనియర్ మంత్రులు వేస్తున్న ఎత్తులతో, జగన్ క్యాంప్ అలెర్ట్ అయ్యింది. కనీసం పది మంది పాత మంత్రులను కొనసాగిస్తే ఎలా ఉంటుంది అనే కసరత్తు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం, జగన్ మెడకు చుట్టుకుని తీరుతుందని, మంత్రి వర్గ విస్తరణ తరువాత, వేగంగా మార్పులు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.