ఏ రాజకీయ పార్టీ అయినా, వ్యక్తి అయినా ఎన్నికల వరకే రాజకీయం చేయాలి. తర్వాత రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం పని చేయాలి. కానీ రాష్ట్రంలో మాత్రం వ్యక్తి గత రాగ ద్వేషంతో పదవి కాంక్షతో పోలవరం నుండి అమరావతి నిర్మాణం వరకు ప్రతి దానికీ పుల్లలు వేస్టున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కల్గిస్టున్నారు .ప్రపంచ బాంక్ కు లెటర్స్, మెయిల్స్ పెడుతున్నారు. ఇదే సమయం లో మీడియా కూడా పనికి మాలిన చర్చలకు ప్రాధాన్యత చూపుతుంది. రాష్ట్రం లో తాజా కార్యమాలు,ప్రాజెక్ట్స్ గురించి ఏమాత్రం వార్తలు రాయటం లేదు. ఇప్పుడు తాజాగా కెనడా నుంచి అమరావతి మీద జరుగుతున్న కుట్ర బయట పడింది...
ఎక్కడ కెనడా... ఎక్కడ అమరావతి.. అనుకుంటున్నారా ? మన ఖర్మకి అలాంటి మనుషులు ఉన్నారు ఇక్కడ... అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వద్దు అని ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకు లెటర్లు రాసిన వారిని చూసాం... వారిని కాదు అని ప్రపంచ బ్యాంకు లోన్ ఇవ్వటానికి రెడీ అవుతుంది... ఇప్పుడు అమరావతితో ఎలాంటి సంబంధం లేని కెనడాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసింది. అయితే ప్రపంచబ్యాంకు రుణ మంజూరు పై కెనడా సంస్థ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుని, విచారణ చెయ్యాలి అంటుంది..
దీంతో రాష్ట్ర ప్రభుత్వ, కేంద్రం ద్వరా రంగంలోకి దిగింది.. కేంద్రం ప్రపంచబ్యాంకుకు గట్టిగా జవాబిచ్చింది. భూసేకరణే జరగనప్పుడు బాధితులు ఎక్కడ నుంచి వస్తారని ప్రశ్నించింది. అమరావతికి కావాల్సిన భూమిని అక్కడి ప్రజలు ఇష్టపూర్వకంగానే భూసమీకరణకు ఇచ్చారని స్పష్టం చేసింది. ‘మీకు రుణం ఇవ్వడంలో అభ్యంతరాలుంటే మరో సంస్థ నుంచి రుణం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ప్రపంచబ్యాంకుకు కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ప్రపంచ బ్యాంకు మళ్ళీ సానుకూలత వ్యక్తం చేసింది... అమరావతితో ఎలాంటి సంబంధమూ లేని కెనడాకు చెందిన ఎన్జీవో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేయడం ఒక వింత... ఇన్ని రాజకీయాలు చేస్తున్నాయి మన పార్టీలు... వీరికి మొదటి నుంచి అమరావతి మీద కక్ష.... అందుకే పట్టు వదలకుండా ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు... లేకపోతే ఎప్పుడో ప్రపంచ బ్యాంకు అమరావతికి రుణం ఇచ్చేది...