రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 39 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 149 కు చేరింది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 39 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీని వల్ల మొత్తం కేసుల సంఖ్య 149కు చేరింది. అనంతపురంలో 2 పోజిటివ్ వచ్చాయి. అలాగే, చిత్తూరులో 9 పోజిటివ్ వచ్చాయి. తూర్పు గోదావరిలో 9 పోజిటివ్ వచ్చాయి. గుంటూరులో 20 పోజిటివ్ వచ్చాయి. కడపలో 18 పోజిటివ్ వచ్చాయి. కృష్ణాలో 23 పోజిటివ్ వచ్చాయి. కర్నూల్ లో 1 పోజిటివ్ వచ్చాయి. నెల్లూరులో 24 పోజిటివ్ వచ్చాయి. ప్రకాశంలో 17 పోజిటివ్ వచ్చాయి. విశాఖలో 11 పోజిటివ్ వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరిలో 15 పోజిటివ్ వచ్చాయి. విజయనగరం, శ్రీకాకుళంలో, ఎలాంటి పోజిటివ్ కేసులు ఇప్పటి వరకు రాలేదు. మరో పక్క, ఆరు గంటలకు రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం, 409 కేసులకు సంబంధించి, ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఇందులో, అత్యధికంగా, 211 టెస్ట్ లు, నెల్లూరు జిల్లాకు సంబంధించినవిగా ఉన్నాయి.

రాష్ట్రంలో కరోనా తీవ్రత, నిర్థరణ పరీక్షలు పెంచడం, పాజిటివ్ కేసులు గుర్తించటం, కరోనా చికిత్స చర్యలు, అన్న క్యాంటీన్ల తెరవటం వంటి ఐదు అంశాలపై తెదేపా అధినేత చంద్రబాబు... సీఎం జగన్​కు లేఖ రాశారు. కరోనా వైరస్ మహమ్మారి.. ప్రపంచాన్ని అతలాకుతం చేస్తోందన్న చంద్రబాబు... రాష్ట్రంలో కొవిడ్ 19 కేసులు విపరీతంగా పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా విస్తరిస్తోన్న వేళ నియంత్రణ చర్యలు కట్టుదిట్టం చేయాలని సీఎం జగన్​ను కోరారు. సమస్యను అంత తేలిగ్గా తీసుకోరాదని సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం కన్నా కరోనా పెనుసంక్షోభమని ఐరాస పేర్కొందని చంద్రబాబు అన్నారు. కరోనా కట్టడికి ఇతర రాష్ట్రాలు, దేశాలు చేపట్టిన చర్యలను నిశితంగా అధ్యయనం చేయాలన్నారు.

రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ ల్యాబ్​లు పెంచాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటివరకు 1,307 పరీక్షలు మాత్రమే చేశారన్నారు. ఎన్ని ఎక్కువ పరీక్షలు చేస్తే అంతగా కరోనాను కట్టడి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. పేదలు పస్తులుండకుండా 'అన్న క్యాంటీన్లు' తెరిచి ఆదుకోవాలని సూచించారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రక్షణ ఉపకరణాలు అందజేయాలన్న చంద్రబాబు... ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది జీతాల్లో కోత పెట్టవద్దని కోరారు. పింఛన్లలో కోత పెట్టడం సరికాదని చెప్పారు. కరోనా వ్యాప్తిపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని కోరారు. అనేక రాష్ట్రాలు, దేశాలు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందిస్తుంటే.. రాష్ట్రంలో వేతనాల్లో కోత పెట్టడం బాధాకరమన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read