ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ప్రతి రోజు కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఏ రోజు కూడా కేసులు సంఖ్య తగ్గటం లేదు. గత నాలుగు రోజులుగా, కేసుల తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈ రోజు మాత్రం అమాంతం 75 కేసులకు వెళ్ళిపోయింది. గడిచిన 24 గంటల్లో, కేసులు అమాంతం పెరిగిపోయాయి. 75 కేసులు ఒక్క రోజులో రావటంతో, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 722కి చేరుకుంది. మొత్తంగా 610 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. డిశ్చార్జ్ అయిన వారు 92 మంది ఉండగా, మరణాలు 20 ఉన్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్ లో, కరోనా అడ్డు అదుపు లేకుండా, పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో, అత్యధికంగా, చిత్తూరు జిల్లాలో 25 కేసులు వచ్చాయి. తరువాత గుంటూరు జిల్లాలో 20 కేసులు వచ్చాయి. కర్నూల్ లో 16 కేసులు వచ్చాయి. అలాగే కృష్ణాలో 5, కడపలో 3, తూర్పు గోదావరిలో 2, అనంతపురంలో 4 కేసులు వచ్చాయి.

ఇక మొత్తంగా చూసుకుంటే, అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 174 కేసులు వచ్చాయి. దేశంలో అత్యధికంగా కేసులు పెరుగుతున్న సిటీగా కర్నూల్ జిల్లా నిలిచింది. తరువాత స్థానంలో, గుంటూరు జిల్లాలో 149 కేసులు వచ్చాయి. అలాగే కృష్ణా జిల్లాల 80 కేసులు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 67 కేసులు ఉన్నాయి. చిత్తూరులో 53 కేసులు వచ్చాయి. అనంతపురంలో 33 కేసులు, తూర్పు గోదావరిలో 26 కేసులు, కడపలో 40 కేసులు, ప్రకాశంలో ౪౪ కేసులు, విశాఖపట్నంలో 21 కేసులు ఉన్నాయి. అయితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ఒక్క కేసు కూడా రాలేదు. ఇక పొతే, విశాఖపట్నం జిల్లాలో, కేవలం 3 ఆక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.

అయితే ఒకేసారి ఇలా కేసులు పెరుగుదల పై విమర్శలు వస్తున్నాయి. గత నెల రోజలుగా లాక్ డౌన్ లో ఉన్నా కూడా, ప్రభుత్వం సరైన టెస్టింగ్ చెయ్యకుండా, వారిని గుర్తించకుండా, తాత్సారం చెయ్యటం వలనే, ఈ రోజు పరిస్థితి అదుపు తప్పింది అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో, 30 కేసులు ఎలా వచ్చాయో కూడా, అధికారులు ట్రేస్ చెయ్యలేకపోతున్నారు. మూడు సార్లు ఇంటి ఇంటికీ సర్వే చేసాం అని చెప్తున్న ప్రభుత్వం, ఈ రోజు వచ్చిన 722 కేసుల పై ఏమి సమాధానం చెప్తుంది అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. విపక్షాలు చెప్పిన సలహాలు తీసుకోకుండా, ఎగతాళి చేసి, ఇక్కడ దాక తెచ్చారని, ఇది ఎప్పటికి ఆగుతుందో కూడా తెలియటం లేదని, విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read