ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క-రో-నా విలయతాండవం చేస్తుంది. దక్షిణభారత దేశంలో, ఒక్క రోజులో నమోదు అయిన కేసుల్లో, ఏపి ఈ రోజు రికార్డు కొట్టింది. గడిచిన 24 గంటల్లో 5041 కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదు కాగా, 56 మంది చనిపోయారు. ఇక మరో పక్క తమిళనాడులో ఇప్పటి వరకు 4979 కేసులతో, దక్షిణ భారత దేశంలో ఒక్క రోజు రికార్డు ఉంటే, దాన్ని ఆంధ్రప్రదేశ్ ఈ రోజు బీట్ చేసింది. మొదటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి. అయితే మేము అందరికంటే గొప్పగా చేస్తున్నాం అంటూ జగన్ ప్రభుత్వం చెప్పుకొస్తున్నా, క-రో-నా కేసులు మాత్రం, రికార్డు కొడుతున్నాయి. మేము బ్రిటన్, కనడా లాంటి దేశాలకు ఆదర్శం అని చెప్పుకొచ్చారు. అయితే పరిస్థితి చూస్తే మాత్రం, అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఒక్క రోజులో 5 వేలు కేసులు అంటే, ఎంతటి ప్రమాదకర స్థాయిలో రాష్ట్రం ఉందో అర్ధం అవుతుంది.

మొత్తంగా ఇప్పటి వరకు 49,650 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు 642గా నమోదు అయ్యాయి. అనూహ్యంగా తూర్పు గోదావరి జిల్లాలు అధిక కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 647 కేసులు నమోదు కాగా, మొత్తంగా 6146 కేసులు ఈ ఒక్క జిల్లాలో నమోదు అయ్యాయి. తరువాత స్థానంలో కర్నూల్ 6045 కేసులు నమోదు అయ్యి. చివరకు విజయనగరం, శ్రీకాకుళంలో కూడా రోజుకు 200కు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.మిగతా రాష్ట్రాలు అయిన ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా లాంటి అత్యధిక కేసులు వస్తున్న రాష్ట్రాల్లో, ఒకే సిటీ నుంచి 80 శాతం కేసులు వస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం, అన్ని జిల్లాల నుంచి కేసులు రావటం చూస్తుంటే, రాష్ట్రం మొత్తం ఎలా స్ప్రెడ్ అయ్యిందో చూడవచ్చు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయాలు మాని, ఈ కరోనాని ఎలా తగ్గించాలో చూస్తే మంచిది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read