చిత్తూరు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి సమస్యకు, ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు ఎదురౌతున్నాయి. కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నవారే కాక తమకు కూడా కరోనా సోకిందేమో అనే అనుమానంతో ప్రజలు పరీక్షా కేంద్రాలకు వస్తున్నారు. రోజురోజుకీ కేసులు ఎక్కువ అవ్వటంతో, ప్రజలు ముందుకు వచ్చి పరీక్షలు చేసుకుంటుంటే, ఉన్న పరీక్షాకిట్లు చాలక, తగినంత కిట్లు లేక ఏర్పడుతున్న మౌలిక సమస్యలతో సహజంగానే పరీక్షా ఫలితాలు రావడంతో ఆలస్యం చోటుచేసుకుంటోంది. మరోవైపు పరీక్షల్లో పాజిటివ్ అని తేలినవారికి తగినన్ని పడకలతో వసతి సౌకర్యాలను కల్పించడానికి నానాపాట్లు పడుతోంది ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో కోవిడ్ పరీక్షా కేంద్రాల వద్ద క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల నిమిత్తం స్వాబ్ శాంపిళ్లను ఇచ్చి వెళ్లేవారితో కొత్త సమస్య ఎదురౌతోంది. శాంపిళ్లు ఇచ్చే సమయంలో ప్రతి ఒక్కరు తమ సెల్ నెంబర్లను, చిరునామాలను సంబంధిత కేంద్రాల వద్ద సమర్పించాల్సివస్తుంది.

పరీక్షల్లో వారికి పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఆ సెల్ నెంబర్‌కు సమాచారం పంపుతారు, పరిస్థితిని బట్టి వారిని ఆసుపత్రికి వచ్చేయమని చేస్తుంటారు. అయితే గత వారం, పది రోజులుగా సెల్ నెంబర్లకు పరీక్షా ఫలితాలను తెలియచేయడానికి చేసే ప్రయత్నాలు విపలమవుతున్నాయి. కొన్ని సెల్ నెంబర్ల నుంచి స్విచాఫ్ అని కానీ, మరికొన్ని నెంబర్ల నుంచి రాంగ్ నెంబర్ అనికానీ సమాధారం వస్తోంది. కొందరిచ్చిన చిరునామాలు కూడా తప్పుడు చిరునామాలని పరిశీలనలో నిర్ధారణ అవుతున్నాయి. వారు సమర్పించిన ఆధార్ నెంబర్లు, అందులో పేర్కొన్న చిరునామాలు కూడా సక్రమంగా లేదని తేలింది. ఆ విధంగా రోజుకు సగటున 20 మంది ఇచ్చిన వివరాలు సరైనవి కావని తేలిపోయాయి. జిల్లాలో అత్యధికంగా తిరుపతి ప్రాంతంలో ఎక్కువగా ఈ సమస్య ఉందని, ఇప్పటివరకు 230 మందికిపైగా తప్పుడు సమాచారం ఇచ్చినవారున్నారని అధికారులు చెబుతున్నారు.

వారందరికీ పాజిటివ్ అని తేలిందని, అయినా తప్పుడు సమాచారం ఇచ్చి ఎటువంటి వైద్యచికిత్సలు చేయించుకోకుండా జనం మధ్య తిరుగుతూ పలువురికి కరోనా వైరసన్ను పంచుతున్నారని జిల్లా వైద్యశాఖాధికారి ఒకరు తెలిపారు. ఇటువంటి వారి వల్ల జిల్లాలో గత మూడు, నాలుగువారాలుగా వీరవిహారం చేస్తున్నకరోనా మరింతగా వ్యాప్తి చెందడానికి ఆస్కారం లభిస్తోందని ఆ ఆధికారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ 230 మందిపై పోలీసులకు వైద్య అధికారులు పిర్యాదులు చేసారు. అయితే ఇదే సమస్యని, 20 రోజుల ముందు చంద్రబాబు ఒక ట్వీట్ చేసి ప్రభుత్వం దృష్టికి తెస్తే, అప్పట్లో వెటకారం చేసారు. ఒకటో రెండో ఫోన్ నంబర్లు తప్పు ఉంటే ఇంత రాద్ధాంతం ఎందుకు అని ఎదురు దాడి చేసారు. ఇప్పుడు ఆ సంఖ్యా ఒకటో, రెండో నుంచి, ఒకే ప్రాంతంలో 230 దాకా వెళ్ళింది. ఇప్పటికైనా, ఈ నంబెర్లు తీసుకునే సమయంలో ఓటీపీ విధానం అమలు చెయ్యాలని, అధికారులు నిర్ణయం తీసుకోవటం, మంచి పరిణామం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read