ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ క-రో-నా ఉదృతి మొదలైంది. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో, ఆ ప్రభావం మన మీద కూడా పడింది. మొన్నటి దాక వంద లోపు కేసులు నమోదు అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పోయిన వారం నెమ్మదిగా పెరుగుతూ వచ్చిన కేసులు, ఈ రోజు వెయ్యి దాటాయి. ఒక్క రోజే వెయ్యి కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావటంతో, దేశ వ్యాప్తంగా ఉన్న ప్యానిక్, మనకు కూడా మొదలైందనే చెప్పాలి. గడిచిన 24 గంటలుగా 1005 కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు చనిపోయారు. ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. గడిచిన 24 గంటల్లో 31 వేల మందిని పరీక్ష చేయగా,  1005కి నిర్ధారణ అయ్యింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో కేసులు పెరుగుతూ ఉండటం, ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నంలో అధికంగా కేసులు ఉన్నాయి. అయితే విద్యా సంస్థల్లో కేసులు ఎక్కువగా రావటంతో, విద్యా శాఖ అప్రమత్తం అయ్యింది. అయితే మళ్ళీ లాక్ డౌన్ పెట్టే అవకాసం లేదని, ఎవరికి వారు జాగ్రత్త పడుతూ, వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read