తమ కొడుకు చనిపోగా వచ్చిన పరిహారం రూ. 5లక్షలలో సగం మంత్రి అంబటి రాంబాబు వాటా అడిగారని, ఈ విషయం మేము బయటకు చెప్పామని చంపేస్తామని బెదిరిస్తున్నారని పర్లయ్య, గంగమ్మ దంపతులు ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయినవారికి ఇచ్చే పరిహారంలో మంత్రి అంబటి రాంబాబు సగం వాటా అడుగుతున్నారని జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చేశారు. పవన్ వ్యాఖ్యలను నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అంబటి సవాల్ చేశారు. ఒక రోజు గడవక ముందే అంబటి బాధితులు బయటికొచ్చారు. డ్రైనేజి ప్రమాదంలో తమ బిడ్డ చనిపోతే.. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారంలో అంబటి రాంబాబు సగం వాటా అడిగారని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన పర్లయ్య, గంగమ్మ దంపతులు ఆరోపించారు. సత్తెనపల్లి పట్టణంలో ఆగస్టు నెల 20వ తేదీన ఓ రెస్టారెంట్ లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరి ఆడక ముగ్గురు చనిపోయారు. వీరిలో తమ బిడ్డ తురకా అనిల్ కు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల పరిహారం చెక్కు రూపంలో వచ్చిందని, దీనికి లంచంగా మున్సిపల్ చైర్మన్ భర్త సాంబశివరావు 2 లక్షలు అడిగారని అనిల్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమను లంచం అడుగుతున్నాారని అంబటి రాంబాబుకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే, ఆయన పరిహారంలో సగం ఇచ్చి వెళ్లండి అంటూ హుకుం జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం మేము బయటకు చెప్పామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ వీడియోని జనసేన నేతలు, సోషల్మీడియా వైరల్ చేస్తోంది. రాజీనామా ఎప్పుడు అంబటి అని నిలదీస్తోంది.
లంచం అడిగి, అడ్డంగా ఇరుకున్న మంత్రి అంబటి..
Advertisements