సొంత ఇల్లు లేక నానా అవస్థలు పడుతున్న ప్రజలకు 1.5 సెంట్ల భూమి ఉచితంగా ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో, స్థలం వస్తుంది అని సంతోష పడ్డారు. ఒక పక్క చంద్రబాబు కట్టించిన ఇళ్ళు ఉన్నా, అవి ఇవ్వకుండా, ఈ స్థలాలు అంటూ ముందుకు తెచ్చారు. అయితే, ఏదో ఒకటి అనుకుంటూ, తనకంటు ఒక సొంత స్థలం రాబోతుందని వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్న పేదకుటుంబాలకు కొంత మంది నాయకులు ఇస్తున్న ఝలక్ కు అప్పులు ఊబిలో కూరు కుపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలం కావాలంటే ఒక్కొక్క లబ్దిదారుడు 30 వేల నుండి లక్షన్నర ఇవ్వాలని నాయకులు డిమాండ్ చెయ్య డంతో ఏమిచెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే స్థలంలో కూడబెట్టుకొని ఉన్న కొద్ది సొమ్ముతో ఇల్లు నిర్మించుకోవాలనే వారి ఆశ నిరాశగా మారింది. వారి దగ్గర ఉన్న కొద్ది పాటి సొమ్ములను నాయకులు గుంజుకు పోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. పదోపరకో ఐతే పరవాలేదు వేలల్లో అడుగుతుంటే ఇచ్చుకోలేక అప్పులు పాలవుతున్నారు.

ఎవరికైనా ఫిర్యాదు చేస్తే వచ్చే స్థలం కూడా రాకుండా పోతుందని బయపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే 2.5 రెట్ల ధర భూములు ఇచ్చే రైతులకు సరిపోవడం లేదని, అందుకే రైతు ధరకు ప్రభుత్వం ఇచ్చే ధరకు మధ్య వ్యత్యాసంను లబ్ధిదారులు నుండి వసూలు చేస్తున్నట్లు నాయకులు సమరించుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చే స్థలంలో, ఈ గుంజుడు ఏమిటి అంటూ లబ్ధిదారుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. లక్షల్లో నిర్బంధవసూళ్లను భరించలేని లబ్ధిదారులు గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబరకు మొరపెట్టుకుంటున్నారు. అలాగే, భూములు కొని, పంచుతున్న దాంట్లో కూడా స్కాం ఉంది అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తక్కువ ధర పలికే భూములు, ఎక్కువ రేటుకు ప్రభుత్వం కొనుగోలు చేసేలా చేసి, రాష్ట్రం మొత్తం, పెద్ద స్కాం చేసారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఒక పక్క ఈ స్కాం చేస్తూనే, మళ్ళీ పేదలను నుంచి కూడా, డబ్బులు గుంజుకోవటం చూసి, అందరూ ఆశ్చర్య పోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read