చంద్ర‌బాబు స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నాన్ని చూసి ఏం చేయ‌లేక బ‌రితెగించి మ‌రీ తెచ్చిన జీవోని రెండు వారాలు కూడా పూర్తి కాక ముందే కోర్టు కొట్టేసింది. 1861 పోలీస్‌ యాక్ట్‌  సెక్షన్‌ 30 ప్రకారం రోడ్లపై ర్యాలీలు, రోడ్‌ షోలు చేపట్టరాదంటూ ప్ర‌భుత్వం నిషేధం విధిస్తూ జీవో 1 తెచ్చింది. ఈ చీకటి జీవోని తక్షణమే రద్దు చేయాలని విప‌క్షాలు ఉద్య‌మించాయి. జీవో 1 సవాల్‌ చేస్తూ హైకోర్టులో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామకృష్ణ పిటిషన్‌ దాఖలు చేశారు. రామకృష్ణ తరపున లాయర్‌ అశ్వినీకుమార్, ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్ శ్రీరామ్ వాదించారు. అనంత‌రం   23 వ తేదీ వరకూ జీవో అమ‌లుపై హైకోర్టు సస్పెన్షన్ విధించింది. టిడిపి, జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టు పార్టీలు కూడా ఇటీవ‌ల కాలంలో ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై రోడ్డుపైకి వ‌స్తున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరిగిన నేప‌థ్యంలో విప‌క్షాల స‌భ‌లు, ర్యాలీల‌కు అశేష‌జ‌నం హాజ‌ర‌వుతున్నారు. ప‌థ‌కాలు ఆపేస్తామ‌ని బెదిరించినా వీరు త‌గ్గ‌డంలేదు. దీంతో ఏకంగా విప‌క్షాలు స‌భ‌లు, ర్యాలీలు పెట్ట‌కుండా  1861 నాటి బ్రిటిష్ చ‌ట్టం అమ‌లుకి బ‌రితెగించింది జ‌గ‌న్ స‌ర్కారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read