న్యాయమూర్తుల పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ రోజు హైకోర్ట్ ధర్మాసనం ముందు మరో సారి విచారణ జరిగింది. నిన్న హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు, సిబిఐ విశాఖపట్నం ఎస్పీ కోర్టు ముందు హాజరు అయ్యారు. పంచ్ ప్రభాకర్ వీడియోల పై హైకోర్టులో దాదాపుగా గంట సేపు చర్చ జరిగింది. పంచ్ ప్రభాకర్ వీడియోలు తొలగించాలి అని, యూట్యూబ్ కి తాము ఎప్పుడో లేఖ రాశామని సిబిఐ కోర్టుకు పేర్కొంది. అయితే తమకు ఎటువంటి లేఖ అందలేదని యూట్యూబ్ తరుపున హాజరు అయిన న్యాయవాది చెప్పటంతో హైకోర్టు ఆశ్చర్య పోయింది. హైకోర్టు రిజిస్టార్ జనరల్ ఇటువంటి అభ్యంతరక వీడియోలు ఏమైనా వస్తే కానీ, లేదా సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తుల పై అసభ్యంగా పోస్టులు పెడితే, రిజిస్టార్ జనరల్ నుంచి లేఖ వస్తే వాటిని వెంటనే తొలగించే విధంగా యూట్యూబ్ చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు ఆదేశాలు ఇస్తే బాగుటుంది అని, స్టాండింగ్ కౌన్సిల్ అశ్వనీ కుమార్ హైకోర్టు ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో హైకోర్టు ధర్మాసనం స్పందించింది. హైకోర్టు సిబిఐకి లేఖ రాయటం, సిబిఐ మళ్ళీ సామాజిక మాధ్యమాలకు లేఖ రాయటం కాకుండా, నేరుగా రిజిస్టార్ జనరల్ లేఖ రాస్తే తాము సిద్ధంగా ఉన్నామని యూట్యూబ్ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

cbi 29102021 2

అదే విధంగా ఫేస్బుక్, వాట్స్ అప్ లకు కూడా ముకుల్ రోహ్తగీ, కపిల్ సిబల్ కూడా న్యాయవాదులుగా హాజరు అయ్యి, వాళ్ళు కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించారు. హైకోర్టు రిజిస్టార్ జనరల్ నుంచి లేఖ వచ్చిన మరుక్షణమే ఈ చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. అయితే పంచ్ ప్రభాకర్ వెనుక కొంత మంది రాజకీయ నాయకులు ఉన్నారని, ఆయన కేవలం తోక మాత్రమే అని, ముండెం తల, వేరే చోట ఉన్నాయని స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టుకు చెప్పింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, అమెరికాలో ఉన్న ఆ ప్రభాకర్ తోకనే కాట్ చేద్దాం అని పేర్కొంది. పంచ్ ప్రభాకర్ విషయం పై ఏమి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని స్టాండింగ్ కౌన్సిల్ అడగటంతో, అఫిడవిట్ వేస్తామని సిబిఐ చెప్పింది. ఇన్ని రోజులు అయినా పోస్టులు ఎందుకు ఆగటం లేదని హైకోర్టు ప్రశ్నించింది. సిబిఐ దార్యప్టు చేస్తున్నా పరిస్థతిలో మార్పు లేదని చెప్పింది. పంచ్ ప్రభాకర్ ఐడెంటిటీ దొరకటం లేదని, సిబిఐ చెప్పగా, హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. హైకోర్టు మీద వ్యాఖ్యలు చేస్తున్న వారినే మీరు పట్టుకోక పొతే సామాన్యులు పరిస్థితి ఏమిటి అని హైకోర్టు ప్రశ్నించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read