తెలుగుదేశం పార్టీ నేత నాదెండ్ల బ్రహ్మం వేసిన బెయిల్ పిటీషన్ పై నిన్న వాదనలు జరిగాయి. విచారణ చేసిన హైకోర్టు, నాదెండ్ల బ్రహ్మంకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల బాండ్‌తో పాటుగా, రెండు పూచీకత్తులను సమర్పించి, బెయిల్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రభుత్వ తరుపు న్యాయవాది బ్రహ్మం చౌదరిని తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో తిరగకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరగా, దీనికి స్పందించిన కోర్టు, పూర్తిగా ఆదేశాలు ఇవ్వలేమని, మూడు వారాల పాటు బ్రహ్మం చౌదరి మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో తిరగకూడదు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సహజంగా పోలీసులు వైఖరి ఇలాంటి కేసుల్లో ప్రశ్నార్ధకం అవుతూ ఉంటుంది. అయితే ఈ సారి జిల్లా జడ్జి ఎందుకు ఇలా చేసారు అంటూ, హైకోర్టు ప్రశ్నించటం కీలక అంశంగా చెప్పుకోవచ్చు. పోలీసులు అరెస్ట్ చూపించి, మంగళగిరి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరు పరిచారు. ఆ సందర్భంలో మేడికొండూరు సీఐ తనను కొట్టారు అంటూ నాదెండ్ల బ్రహ్మం కోర్టుకు తెలిపారు. అయితే ఆ విషయాన్ని జడ్జి రికార్డ్ అయితే చేసారు కానీ, ఇతర ఏ ఆదేశాలు ఇవ్వకుండా, నాదెండ్ల బ్రహ్మంను రిమాండ్ కు పంపించారు.

brahmam 26102021 2

ఇదే అంశం పై హైకోర్టు నిన్న జిల్లా జడ్జిని ప్రశ్నించింది. పోలీసులు తనను కొట్టారని చెప్తున్నా, ఎందుకని అతని మాటలు పట్టించుకోలేదని, గాయాలు ఎందుకు పరిశీలించలేదని, వైద్య పరీక్షలకు పంపకుండా, రిమాండ్ కు ఎందుకు పంపారు అంటూ, హైకోర్టు జిల్లా జడ్జిని ప్రశ్నించింది. ఈ అంశం పై తమకు గురువారం లోపు వివరణ ఇవ్వాలని జిల్లా కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసులు అన్నీ ఏడేళ్ళ లోపు కేసులు అయినా, సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా ఎందుకు అతన్ని అరెస్ట్ చేసారు అంటూ కోర్టు ప్రశ్నించింది. టిడిపి కార్యాలయం పై దా-డి సందర్భంగా, తాను అక్కడకు వెళ్ళగా, తనను కులం పేరుతో దూషిస్తూ , తన పై హ-త్యా-య-త్నం చేసారు అంటూ, డీజీపీ కార్యాలయంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జి.సక్రూనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, నాదెండ్ల బ్రహ్మంను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ కేసు పై బెయిల్ పై నాదెండ్ల బ్రహ్మం విడుదల అయ్యారు. విడుదల అయిన తరువాత, కొంత మంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, అందరికీ వడ్డీతో సహా ఇచ్చే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read