మధ్య ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద నిర్మించిన గృహాల పై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం శివరాజ్ చౌహాన్ ఫోటోలతో పెట్టిన టైల్స్‌ను తొలగించాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. పీఎంఏవై పథకం కింద నిర్మించిన గృహాల్లో ఏ రాజకీయ నాయకుడి ఫోటో ఉండడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికే ఇళ్లలో పెట్టిన టైల్స్‌ను మూడు నెలల్లోగా తొలగించాలనీ, ఈ వ్యవహారం పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్‌లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
దాటియా నివాసి సంజయ్ పురోహిత్ జూలైలో దాఖలు చేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యం (పిల్) మేరకు గ్వాలియర్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. ప్రధాని, సీఎం ఫోటోలు ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ పిటిషనర్ ప్రశ్నించారు. ప్రజాధనంతో నిర్మించిన ఇళ్లను ఎన్నికల్లో లబ్ధి కోసం వినియోగించుకోరాదన్నారు. కాగా కోర్టు ఆదేశాల మేరకు ఫోటోలతో కూడిన టైల్స్‌ని తొలగిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోటోలు తొలగించాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు కోర్టుకు తెలిపింది.
అయితే ఈ విషయంలో, మన రాష్ట్రంలో ఉన్న బీజేపీ వారికి కూడా వర్తిస్తుంది. ప్రతి పధకానికి మా మోడీ బొమ్మ వెయ్యలేదు అంటూ, బీజేపీ చేసే హడావిడి తెలిసిందే. ఎదో ఒక చోట సియం బొమ్మ వేస్తారు కాని, వీళ్ళు మరి టైల్స్ కి కూడా, మోడీ బొమ్మ వెయ్యమంటం ఏంటో, వారికే తెలియాలి. ఈ విషయం పై ఇది వరుకే చంద్రబాబు కూడా చురకలు అంటించారు కూడా. మీరు ప్రతి పధకానికి మోడీ బొమ్మ పెట్టమంటున్నారు, మీ మోడీ ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాలు ఉన్నారు, మరి అప్పుడు, మీ గుజరాత్ లో, మన్మోహన్ సింగ్ బొమ్మ వేసారా అని ప్రశ్నించటంతో ఒక్కరికి కూడా సౌండ్ లేదు. అయినా, మరీ కక్కుర్తి కాకపోతే, టైల్స్ కి కూడా మోడీ బొమ్మ ఏంటి ?