గత ప్రభుత్వ హాయంలో చేసిన ఉపాధి హామీ పనులకు నిధులు ఇవ్వకుండా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు పై కాంట్రాక్టర్ లు కోర్టు మెట్లు ఎక్కి చేస్తున్న పోరాటం, ఎట్టకేలకు ఫలించింది. కాంట్రాక్టర్లు అంటే, వీళ్ళు ఏదో పెద్ద పెద్ద వాళ్ళు కాదు. చిన్న చిన్న వాళ్ళు. ప్రభుత్వం వర్కులు అని చెప్పి, అప్పులు తీసుకుని వచ్చి మరీ కాంట్రాక్టులు చేసిన వాళ్ళు. ఇలాంటి కాంట్రాక్టర్లును, జగన్ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. ఎన్ని సార్లు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉపాధి హామీ బిల్లులు గురించి అడిగినా, వారు చెల్లించలేదు. మరో పక్క కేంద్రం తన వాటాగా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసింది. అయితే ఆ డబ్బులు దారి మళ్ళించి, వేరే అవసరాలకు వాడుకుని, వీరికి బిల్లులు చెల్లించకుండా, వీరిని ఇబ్బంది పెడుతూ వచ్చారు. అయితే దీని పై దాదాపుగా వెయ్యికు పైగా కాంట్రాక్టర్లు కోర్టు మెట్లు ఎక్కారు. గత కొన్ని నెలలుగా, ఈ విషయం పై విచారణ జరిగింది. అయితే ఈ ప్రక్రియలో అనేక సార్లు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి అవకాశాలు ఇచ్చినా, ప్రభుత్వం మాత్రం చెల్లింపులు చేయలేదు. చివరకు కోర్ట్ ధిక్కరణ కేసులు, అధికారులు కోర్టు ముందుకు రావటం ఇవన్నీ జరిగినా, ప్రభుత్వం మారలేదు. అయితే, ఈ రోజు హైకోర్టు తుది తీర్పు ఇస్తూ, మొత్తం బకయాలు వెంటనే చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.

money 05102021 2

అంతే కాదు, మొత్తం చెల్లింపులకు, ఎప్పటి నుంచి పెండింగ్ ఉందో, అప్పటి నుంచి కూడా 12 శాతం వడ్డీ కలిపి చెల్లించాలి అంటూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మొత్తం దాదాపుగా 2800 కోట్లుగా తేలింది. అయితే వీటిని ఇప్పుడు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి, వడ్డీకి మాత్రం నాలుగు వారాల టైం ఇచ్చింది హైకోర్టు. అయితే ఇది ఇలా ఉంటే, అసలు ఎలా చెల్లించాలి, ఏమి చేయాలి అనే విషయం పై, ఇప్పుడు ప్రభుత్వానికి పాలు పోవటం లేదు. హైకోర్టు ఇచ్చిన డెడ్లైన్ ప్రకారం, వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. జీతాలకు కూడా అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు కూడా రెండు వేల కోట్లు అప్పు తెచ్చారు. ఇలా అనేక విధాలుగా, అప్పులు మీద నెట్టుకుని వస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టు ఇచ్చిన డెడ్లైన్ తో షాక్ తగిలింది. అయితే ఈ ప్రక్రియను ఎలాగైనా వాయిదా వేయాలి అంటే, పై కోర్టులో అపీల్ చేసి, కేసు తేలే వరకు ఎలాగైనా సగదీయటం తప్ప, రాష్ట్ర ప్రభుత్వానికి వేరే మార్గం లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం అప్పు ఇచ్చే వాళ్ళు కూడా లేరు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read