ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, జగన్ ప్రభుత్వం పై తీవ్రంగా స్పందించింది. మేము ఆదేశాలు ఇచ్చినా, మీరు పాటించటం లేదు అంటే, దాన్ని కోర్ట్ ధిక్కరణ కింద తీసుకోవాలా అని ప్రశ్నించింది. విద్యుత్ ఒప్పందాల పై సమీక్ష కేసులో, హైకోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది. పోయిన వారం, 40 కంపెనీలు , ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్ట్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. సోలార్, విండ్ ఉత్పత్తి చేసే విద్యుత్ ఒప్పందాలు సమీక్ష చేసేందుకు, ప్రభుత్వం ఒక హై పవర్ కమిటిని నియమించిన సంగతి తెలిసిందే. దీని పై, జీఓ నెంబర్ 63ని రిలీజ్ చేసారు. అయితే, ఈ 40 కంపెనీలు కోర్ట్ కి వెళ్ళటంతో, పోయిన వారం హైకోర్ట్, జీఓ నెంబర్ 63ని నాలుగు వారల పాటు సస్పెండ్ చేసింది. అంతే కాదు, ప్రభుత్వం ఈ కంపెనీలకు ఇచ్చిన నోటీసులు కూడా సస్పెండ్ చేసింది.
అయితే కోర్ట్ ఈ తీర్పు ఇచ్చిన తరువాత కూడా, ప్రభుత్వం, ఆ కంపెనీలను వేధిస్తుంది. దీంతో వారు మళ్ళీ కోర్ట్ కు వెళ్లారు. ఈ నేపధ్యంలోనే కోర్ట్, ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మేము నాలుగు వారాల పాటు, మీ నిర్ణయాన్ని సస్పెండ్ చేసాం, అయినా కూడా విద్యుత్ కొనుగోలు చేయబోమంటూ కొన్ని సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడమేంటని హై కోర్ట్, నిలదీసింది. ‘మీ ప్రభుత్వం చేస్తున్న చర్యలు మంచి ఉద్దేశంతో కూడినవేనా? విద్యుత్ ను మీ దగ్గర నుంచి కొనుగోలు చెయ్యం అని మీరు చెప్పడం కూడా మంచి ఉద్దేశంతో తీసుకున్న చర్యేనా? మేం ఉత్తర్వులు ఇచ్చిన తరువాత కూడా మీరు విద్యుత్ కొనుగోలు చేయబోమని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెప్పారు అంటే, ప్రాథమికంగా కోర్ట్ ఆదేశాల ఉల్లంఘనే’ అంటూ హై కోర్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
గతంలో ఎప్పుడైనా ఇలా విద్యుత కొనుగులు చెయ్యటం ఆపేశారు, చేస్తే ఎందుకు చేసారు, తదితర వివరాలు అన్నీ తమకు ఇవ్వాలని, సమగ్ర నివేదికలు తమకు సమర్పించాలని, న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, ఈ కేసు తీర్పును గురువారానికి వాయిదా వేసారు. మొన్న 40 కంపెనీలతో పాటు, ప్రభుత్వం తమను కూడా వేధిస్తుంది అంటూ, మిత్రా వాయు ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, మంగళవారం కోర్ట్ లో కేసు వేసింది. దీంతో, ఆ జీఓ రాద్దు, నాలుగు వారాలు పాటు చేసింది, ఈ కంపెనీకి కూడా వర్తిస్తుంది అంటూ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. చంద్రబాబుని ఎలా అయినా ఇరికించాలి అనే ఉద్దేశంతో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే, ఆ ఒప్పందాల పై సమీక్ష మొదలు పెట్టారు. కేంద్రం వద్దు అంటున్నా, చివరకు కోర్ట్ కూడా అలా చెయ్యకూడదు అంటున్నా ప్రభుత్వం వినటం లేదు.