అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 13 పై అమరావవతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని ప్రభుత్వ, కార్యాలయాలను కర్నూలుకు, తరలించాలని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో అమరావతి నుంచి కమిషనర్ ఆఫ్ ఎంక్వరీస్, రాష్ట్ర విజిలెన్స్ కమి షనర్ కార్యాలయాలను తర లించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే ఈ జీవో చట్టవిరుద్ధమని రైతులు ఆరోపిస్తూ , పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్‌డీఏ చైర్శ తో పాటు సిఆర్‌డీఏ కార్యాలయాన్ని అందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. దీనిపై విచారణను మంగళవారం చేపట్ట నున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ రోజు విచారణ చేసిన న్యాయస్థానం, ప్రభుత్వం పై, ఆగహ్రం వ్యక్తం చేసింది. మేము ఆదేశాలు ఇచ్చాం, ఫిబ్రవరి 26 వరకు తొలగించవద్దు అని ఆదేశాలు ఇచ్చాం, పిటిషన్లు పెండింగ్‌లో ఉండగానే, ఎందుకు కార్యాలయాలు తొలగించారని హైకోర్ట్ రాష్ట్రాన్ని ప్రశ్నించింది.
దీని పై స్పందించిన ప్రభుత్వ లాయర్, ఈ కార్యాలయాల తరలింపు అనేది ఏపి ప్రభుత్వ నిర్ణయమని, అమరావతిలో కార్యాలయాల నిర్వహణ సరిగాలేదని కోర్ట్ కు తెలిపారు. ఇక్కడ ఉన్న స్థలంలోనే కొత్త నిర్మాణాలు చేపట్టవచ్చు కదా అని కోర్ట్ ప్రశ్నించింది. విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై స్టే విధించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. కాగా పలు ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు, కర్నూలుకు తరలిం చేందుకు ముఖ్యమంత్రి జగన్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో మిలినియం టవర్ బి నిర్మాణం కోసం 19.23 కోట్లు కేటాయించారు. విశాఖ మిలినియం టవర్స్ లోనే నచివాలయాన్ని తరలించాలని జగన్ నిర్ణ యించారు. అయితే ఈ అంశంపై కూడా గతం లోనే రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కార్యాలయాల తరలింపును నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదే శిం చింది. అతిక్రమిస్తే ఆయా శాఖాధిపతులపై విచారణ జరపాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ జగన్ తన ప్రయత్నాలు ఏమాత్రం ఆపలేదు. విశాఖకు నిధులు కేటాయించడం ద్వారా కార్యాలయాల తరలింపు జరగడం ఖాయమన్న సందేశాన్ని ఇచ్చారు. మరో పక్క అమరావతి రైతులు ఉద్యమాలు కొనసాగి స్తూనే ఉన్నారు. కేంద్రం ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై స్పందిం చికపోయినా భారతీయ జనతా పార్టీ నేతలు, ఆ పార్టీ మద్దతు తెలిపిన జనసేన అధ్యక్షుడు పవన్ అమరావతి నుంచి రాజధానిని తరలించే ప్రసక్తి లేదని ప్రకటనలు చేస్తున్నారు. దీనితో అమరావతి నుంచి రాజధాని తరలింపు అంశం వివాదాస్పదంగా మారింది.